Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CAT Admit Card 2020 Released

 

CAT Admit Card 2020 Released

క్యాట్ 2020 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌ లోడ్ కోసం క్లిక్‌ చేయండి..!

ఐఐఎం- ఇండోర్ క్యాట్‌ 2020 పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. 

CAT 2020 పరీక్ష నిర్వహిస్తున్న ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఇండోర్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. క్యాట్ 2020 కోసం దరఖాస్తు చేసుకుని, సంబంధిత ఫీజులు చెల్లించిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను https://iimcat.ac.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డుల్లో అభ్యర్థి అప్లికేషన్ నెంబర్, రోల్ నెంబర్, ఎగ్జామ్ సెంటర్ వివరాలు ఉంటాయి. 

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి‌: 

క్యాట్ 2020 ఎగ్జామ్ నవంబర్ 29న నిర్దేశిత పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా అడ్మిట్ కార్డును తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్ కూడా తీసుకు వెళ్లాలి. క్యాట్‌ పరీక్ష ఈ సంవత్సరం 156 పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది. 

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలనుకునేవారు మొదట https://iimcat.ac.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం లాగిన్ కోసం మీ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాట్ 2020 అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది. 

ముఖ్య వివరాలు:

పరీక్ష పేరు: క్యాట్‌ (Common Admission Test)-2020

ఉద్దేశం: దేశంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లతోపాటు ఇతర అత్యుత్తమ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చదవడానికి అర్హత పరీక్ష.

విద్యార్హత: కనీసం 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45) మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు క్యాట్ పరీక్ష‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులూ ఈ పరీక్ష రాయటానికి అర్హులే.

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌: అక్టోబర్‌ 28, 2020 నుంచి

పరీక్ష తేది: నవంబర్‌ 29, 2020

ఫలితాలు విడుదల: 2021, జనవరి రెండో వారం

వెబ్‌సైట్‌: https://iimcat.ac.in/ 

Previous
Next Post »
0 Komentar

Google Tags