Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CM Video Conference Details 20-10-2020

 


CM Video Conference Details 20-10-2020 

- School reopen on November 2 

- Schools should work Half day - 9:am to 1:30pm 

- Half of the students to allow schools every day - i.e., weekly three days 

- Every day to conduct awareness to students on COVID-19 in one session 

- Every class room to be allowed only 16 or 20 students only for seating

Jagan crucial orders on flood relief:

ఏపీలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్న కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని ఆదేశాలు జార చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అక్టోబర్ 14వ తేదీన జరిగిన రివ్యూలో సూచించిన విధంగా పని చేసిన జిల్లాల కలెక్టర్లను ఆయన అభినందించారు. భారీ వర్షాల కారణంగా కుటుంబీకులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షనం 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ మంగళవారం స్పందన రివ్యూ నిర్వహించారు. 7 ప్రధాన అంశాలపై జరిగిన సమీక్షలో భారీ వర్షాలు, వరద పరిస్థితి, కోవిడ్, ఎన్‌ఆర్‌ఈజిఎస్, నాడునేడు, విలేజీ, వార్డు సెక్రటేరియట్స్‌ తనిఖీలపై సీఎం తాజా పరిస్థితిని తెలుసుకున్నారు.

నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

'' వర్షాలకు సంబంధించి కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ నెల 14న సమీక్ష నిర్వహించాం.. గడిచిన పదిరోజులుగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.. కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలి.. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో.. వారికి వెంటనే సాయం చేయండి.. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం వెంటనే.. త్వరితగతిన ఇవ్వండి.. కలెక్టర్లు దగ్గరుండి చూసుకొండి.. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లందరు అక్టోబరు 31వ తేదీలోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయండి..'' అని సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్.

వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే మొదలుపెట్టాలని నిర్దేశించారు. కరెంటు పునరుద్ధరణ విషయంలో కలెక్టర్లు వేగంగా స్పందించిన కలెక్టర్లను సీఎం అభినందించారు. అక్టోబర్ 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags