Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Corona By Air: Spread over a distance of more than 6 feet: CDC Report



Corona By Air: Spread over a distance of more than 6 feet: CDC Report
గాలి ద్వారా కరోనా: 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నా వ్యాప్తి.. సీడీసీ నివేదిక
మాస్క్ విధిగా ధరించి, భౌతికదూరం పాటించడం వల్ల కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు, డబ్ల్యూహెచ్ఓ సూచించిన విషయం తెలిసిందే.

మూసి ఉన్న ప్రదేశాలు, గదులలో కోవిడ్ రోగి నుంచి ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ స్పష్టం చేసింది. తాజా పరిణామాలతో వ్యాపార సంస్థలు, పాఠశాలల పునఃప్రారంభానికి కొత్త సవాల్ ఎదురవుతోంది. కరోనా వైరస్ కొన్నిసార్లు చిన్న కణాల ద్వారా వ్యాప్తి చెందుతుందని, గతంలో సురక్షితంగా భావించిన దూరం నుంచి కూడా సోకుతుందని సీడీసీ తెలిపింది. వైరస్ బారినపడకుండా కార్యాలయాలు, రెస్టారెంట్లు, దుకాణాల వద్ద కనీసం ఆరు అడుగుల భౌతికదూరం (1.8 మీటర్లు) పాటించాలని నిపుణులు సూచించారు.

ప్రస్తుతం కోవిడ్ -19 నిర్ధారణ అయిన వ్యక్తులు 6 అడుగుల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నా లేదా రోగి ఓ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే వైరస్ వ్యాప్తిచెందుతున్నట్టు కొన్ని అధ్యయన నివేదికలు వెల్లడించాయని పేర్కొంది. మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో అర్థం చేసుకున్నదాని కంటే ఎక్కువ దూరం సార్స్-కోవి-2 గాలి ద్వారా వ్యాప్తిచెందుతున్నట్టు శాస్త్రీయ ఆధారాలు లభించిన నెలరోజుల తరువాత సీడీసీ ప్రకటించడం చూస్తే మార్గదర్శకాలను మార్పుచేసే దిశగా పయనిస్తున్నట్టు అర్ధమవుతోంది. గత నెలలో గాలి ద్వారా వైరస్ సంక్రమించడంపై మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి, వెంటనే తొలగించింది. తరువాత దానిని తప్పుగా పోస్ట్ చేశామని వివరించింది.

అమెరికాలో మహమ్మారి మరింత తీవ్ర దశకు మారుతున్నట్లు సంకేతాలు వెలువడటంతో కొత్త మార్గదర్శకాలను వెలువరించనుంది. ఇటీవల 34 రాష్ట్రాల్లో ఏడు రోజుల సగటు కేసులు నెల కిందటి కంటే ఎక్కువగా నమోదుకావడం, వైట్‌హౌస్‌లోనూ వైరస్ వ్యాప్తి విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, విద్యా సంస్థలు పునఃప్రారంభానికి సిద్దమవుతున్నారు. ఫ్లోరిడా వంటి రాష్ట్రాలు రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలపై ఆంక్షలను ఎత్తివేశారు.

గాలి ద్వారా వైరస్ సంక్రమించదని, వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని గతంలో సీడీసీ సూచించింది. రోగితో సన్నిహితంగా ఉంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. సీడీసీ సవరించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. వైరస్ కణాలు కొన్నిసార్లు గాలి ద్వారా వ్యాపిస్తాయని, ప్రత్యేకించి వెంటిలేషన్ సక్రమంగా లేని ప్రదేశాలలో త్వరగా సంక్రమిస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags