Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Do not take this food and drinks together



Do not take this food and drinks together
ఈ ఆహారం, పానీయాలు.. ఒకేసారి కలిపి తీసుకోవద్దు

ఈ కింద పేర్కొన్న ఐదు అలవాట్లలో ఏదో ఒకటి మీకు ఉండే ఉంటుంది. అలా ఆహారం తీసుకోవడం వల్ల అనార్థాలేమిటో తెలుసుకుని.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

ఈ ఆహారం, పానీయాలు.. ఒకేసారి కలిపి తినొద్దు!

అన్నం తినేప్పుడు కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. కొంతమంది శీతల పానీయాలతో పాటు భోజనం చేయడం అలవాటు. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి హానికరం అనే సంగతి మీకు తెలుసా? 

ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో చాలామంది అన్నంతోపాటు ఇతరాత్ర పదార్థాలను, పానీయాలను కలిపి తింటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. కొందరు అన్నంతో కలిపి పాలు, పండ్లు తీసుకుంటారు. ఇది కూడా మంచి అలవాటు కాదు. అంతేకాదు.. అన్నంతోపాటుగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. అన్నం తినేప్పుడు ఇక్కడ సూచించిన ఆహార పదార్థాల కాంబినేషన్ లేకుండా జాగ్రత్తపడండి. 

భోజనం + పండ్లు:

కొంతమందికి అన్నం తిన్న వెంటనే పండ్లు తినడం అలవాటు. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలేవీ శరీరానికి పూర్తిగా అందవు. భోజనం చేసిన గంట తర్వాత పండ్లను తినడం ఉత్తమం. కనీసం అరగంట విరామం ఇచ్చినా పర్వాలేదు. ప్రతి ఒక్కరూ సీజన్లో లభించే ప్రతి పండును తినాలి. రాత్రి పూట ఆకలి ఎక్కువైతే చిల్లర తిండికి బదులు పండ్లను తినడమే ఉత్తమం. 

అన్నం + నీరు:

చాలమందికి నీళ్లు తాగితేగానీ ముద్ద దిగతు. అన్నం తింటున్నంత సేపు నీళ్లు తాగేస్తూ కడుపు నింపేసుకుంటారు. దీనవల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. కాబట్టి.. భోజనం ముగిసిన అరగంట వరకూ మంచినీళ్లను తాగొద్దు. ముద్ద దిగడం కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక గుటక నీళ్లు తాగండి. అప్పుడే మీరు తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి.

 భోజనం + టీ:

 కొందరికి భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల ఆహారంలోని పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందవు. టీలో ఉండే టానిన్లు ఆహారంలోని ఐరన్, ప్రొటీన్లతో కలవడం వల్ల ముఖ్యమైన ఈ పోషకాలను శరీరం గ్రహించలేదు. ఫలితంగా.. భోజనం చేసినా ఫలితం ఉండదు. 

చీజ్ + కూల్ డ్రింక్స్:

చీజ్‌తో చేసిన ఆహార పదార్థాలు తినేప్పుడు కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు. కార్బోనేటెడ్ డ్రింకుల్లో ఫ్రక్టోజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. ఇందులోని చక్కెర్ల వల్ల లావయ్యే అవకాశాలు కూడా అధికం. చీజ్‌లో ఉండే కొవ్వులు వీటికి తోడైతే త్వరగా బరువు పెరిగిపోతారు. కాబట్టి ఈ కాంబినేషన్ అస్సలు వద్దు. పెరిగే బరువు.. గుండెకు సమస్యలు తెస్తుంది. డయబెటీస్ వంటి వ్యాధులు కూడా వెంటాడతాయి. 

అరటి పండ్లు + పాలు:

ఇవి రెండు ఒకేసారి తీసుకుంటే కడుపు త్వరగా నిండిపోతుంది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పాలను అరిగించుకోలేరు. కాబట్టి పాలు తాగిన అరగంట తర్వాత పండ్లను తినడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల పండ్లలోని పోషకాలన్నీ శరీరానికి సక్రమంగా అందుతాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags