Gandhi Jayanti: Let
us remember the wonderful sayings of the Mahatma
గాంధీ జయంతి : మహ్మాత్ముని
అద్భుతమైన సూక్తులను ఒకసారి స్మరించుకుందాం
గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య
మానవునిగా పుట్టిన మహాత్మ గాంధీజీ తెల్లదొరలను శాంతి, అహింస
అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎనో పోరాటాలు చేశారు. ఈ సమయంలో యావత్ భారతావని
అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది. కోట్లాది మంది జనాలు ఆయన వెంట
నడిచారు. ఈ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు.
అలాంటి మహోన్నత వ్యక్తికి
స్వాతంత్య్రం రాకముందు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటనీ అధిగమించి
మహాత్ముడు ఓ వ్యక్తి నుండి మహాశక్తిలా మారాడు. బ్రిటీష్ వారు మన దేశం నుండి
వెళ్లిపోయేందుకు సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం,
స్వదేశీ వంటి ఉద్యమాలను ఎన్నో చేశారు.
అలా ఆయన చేసిన పోరాటాలు.. వారి
త్యాగ ఫలితాల వల్లే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆనాడు ఆ మహాత్ముడు చేసిన
త్యాగం ఫలితంగా మనం నేడు స్వేచ్ఛగా మన హక్కులను పొందగలుగుతున్నాం. ఓ సామాన్యుడిగా
ఉండి తను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన తీరు ఆమోఘం. ఇలా ప్రపంచం మొత్తానికి
స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత. బాపూజీ 151వ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన సూక్తులలో ముఖ్యమైన వాటిని ఓ సారి
స్మరించుకుందాం..
1. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు
చెప్పాలి.. ఎంత గొప్పగా మరణించావో.. ఇతరులు చెప్పాలి.
2. విద్య దాచుకోవడం కన్నా..
పది మందికి పంచితే మరింత పెరుగుతుంది.
3. మనిషి గొప్పదనం మెదడులో
కాదు.. తన హృదయంలో ఉంటుంది.
4. బలహీనులు ఎప్పటికీ
క్షమించలేరు.. ఎందుకంటే క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి..
5. మంచి పుస్తకాలు మనతో
ఉంటే.. మంచి నేస్తం లేని లోటు తీరినట్లే.
6. భయం వల్ల పొందే ఆధిపత్యం
కంటే.. అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.
7. లేని గొప్పదనం ఉందని
చెబితే.. ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది.
8. నా దగ్గర ప్రేమ తప్ప మరొక
ఆయుధం లేదు.. ప్రపంచంతో స్నేహం చేయడమే నా గమ్యం.
9. నీతిగా జీవించడమంటే.. మనం
మన మనసు మీద కోరికల మీద అధికారం సంపాదించాలి.
10. మనం పొరపాట్ల ద్వారా..
ఓటమి ద్వారా.. పాఠాలు నేర్చుకుని.. లాభం పొందాల్సి ఉంటుంది.
0 Komentar