Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How Does Cutting, Slicing, and Chopping Affect Fresh Vegetables

 


How Does Cutting, Slicing, and Chopping Affect Fresh Vegetables

కూరగాయలను పీల్ చేసి కట్ చేస్తున్నారా..

తరిగిన తరువాత అలాగే పీల్ చేసిన తరువాత కూరగాయలను కడిగితే వాటిలోనున్న పోషకవిలువలు తగ్గిపోతాయి. 

వెజిటబుల్స్ నుంచి బోలెడన్ని పోషకాలు మనకు అందుతాయి. అయితే, మనం వాటిని తరిగే విధానం ద్వారా అలాగే వాటిని పీల్ చేసే విధానం కూడా వాటిలోని పోషకాలను దెబ్బతీసే అవకాశం ఉంది. సరైన విధంలో కూరగాయలను తరగకపోతే వాటిలోని పోషకాలు మనకు అందవు. ఇక్కడ కూరగాయలను చాప్ చేసే విధానానికి సంబంధించి కొన్ని టిప్స్ ను మీకు వివరిస్తున్నాము. 

కూరగాయలను బాగా కడుక్కోవాలి:

ఇది మొట్టమొదటి రూల్. కూరగాయలను శుభ్రంగా కడగాలి. తరగడానికి అలాగే పీల్ చేయడానికి ముందు కూరగాయలను శుభ్రంగా కడగాలి. ఈ ప్రాసెస్ అనేది కూరగాయల పై పొరపై ఉన్న దుమ్మును అలాగే హానికర బాక్టీరియాను తొలగించేందుకు హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ను నిలిపి ఉంచేందుకు కూడా సహకరిస్తుంది. తరిగిన తరువాత అలాగే పీల్ చేసిన తరువాత కూరగాయలను కడిగితే వాటిలోనున్న పోషకవిలువలు తగ్గిపోతాయి. హెల్త్ బెనిఫిట్స్ ను అందించే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ను కోల్పోతాము. 

మొండి కత్తిని వాడవద్దు:

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్‌లో పబ్లిష్ ఐన స్టడీ ప్రకారం మొండి కత్తిని వాడటం వల్ల కూరగాయలు డేమేజ్ అయిపోయే రిస్క్ ఉందని తేలింది. షార్ప్ గా ఉన్న కత్తి బదులు మొద్దుబారిన కత్తిని వాడితే కూరగాయలలో పోషకాలను కోల్పోతాము. కూరగాయల్లో ఎలెక్ట్రోలైట్ లీకేజ్ జరిగే అవకాశం ఉంటుంది. వాటినుంచి పొటాషియం అలాగే కాల్షియం వంటివి బయటకు పోతాయి. ఈ లాజిక్ అనేది దుర్వాసనను కూడా కలిగిస్తుంది. 

పీలింగ్:

పీలింగ్ చేసేటపుడు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. థిన్ లేయర్ నే పీల్ చేయాలి. దాంతో ముఖ్యమైన న్యూట్రియెంట్స్ ను మనం నిలిపి ఉంచగలుగుతాము. ఆసక్తికరంగా, పీలింగ్ చేసే విధానం కూడా కూరగాయల పోషకాలపై ప్రభావం చూపిస్తుందట. పీలర్ ను ఉపయోగించి చేత్తో పీల్ చేసేటప్పుడు వాటిపై హానికర బాక్టీరియా తక్కువగా ఉంటుందట. అదే, ఫ్యాక్టరీ సెట్టింగ్ లో మెషిన్ పీలర్స్ విషయంలో కూరగాయలపై హానికర బాక్టీరియా ఎక్కువగా ఉన్నట్టు స్టడీస్ లో వెల్లడైంది.   

చాపింగ్ మెథడ్:

చాలా సన్నగా కూరగాయలను తరగడం వల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండదట. వెజిటబుల్స్ చూడ్డానికి అందంగా ఉండాలని వాటిని ఫైన్ గా తరుగుతూ ఉంటారు చాలామంది. ఐతే, ఇక్కడే పోషకాలు తరిగిపోతాయట. బాగా సన్నగా తరిగిన వెజిటబల్స్ త్వరగా పాడైపోతాయట. మాములుగా తరిగినవాటికంటే బాగా సన్నగా తరిగినవాటికే ఈ రిస్క్ ఎక్కువట. ఈ మెథడ్ వల్ల వెజిటబుల్స్ లో మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోతుంది. నేచురల్ కలర్ ను అవి కోల్పోతాయి. దాంతో వాటిలోనున్న పోషకాలు తగ్గిపోతాయి. వెజిటబుల్స్ ను ముందుగా కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకుందాం అనుకున్నప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా వాటిని తరగడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 

వెజిటబుల్స్ గురించి తెలుసుకోండి

ప్రతి కూరగాయను ఒకే విధంగా కట్ చేయకూడదు. తరిగే విధానం అలాగే పీల్ చేసే విధానం కూరగాయలను బట్టి మారుతూ ఉంటుందని. దోసకాయ, టమాటో, ఆలుగడ్డ అలాగే వంకాయలు స్కిన్ ను పీల్ చేయవద్దు. వాటి స్కిన్ ను కూడా తినేయవచ్చు. న్యూట్రియెంట్ లాస్ కు కారణమయ్యేవి మూడే మూడు ఫ్యాక్టర్స్. అవేంటంటే, వేడి, ఆక్సీజన్ అలాగే వెలుతురు. కట్ చేయకపోతే కూరగాయలనేవి ఆక్సీజన్ అలాగే వెలుతురుకు గురికాకుండా ఉంటాయి. 

ఈ ప్రాసెస్ లో ఎక్కువగా సఫర్ అయ్యే విటమిన్ గా విటమిన్ సి గురించి చెప్పుకోవాలి. కొన్నిసందర్భాలలో విటమిన్ ఏ అలాగే విటమిన్ ఈ పై కూడా ప్రభావం పడుతుంది. ఈ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఇవి ఆక్సీజన్‌కు రియాక్ట్ అవుతాయి. పీల్స్ అలాగే కవరింగ్స్ అనేవి నేచురల్ గానే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ ను ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రొటెక్టివ్ కవరింగ్స్ ను తొలగించగానే వీటిలోపలి పదార్థం గాలికి ఎక్పోజ్ అవుతుంది. దాంతో, ఆక్సీజన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ ను తగ్గిస్తుంది. 

విటమిన్ సి అనేది నీళ్లతో క్యారీ చేయబడుతుంది. కాబట్టి, ఇది ఈజీగా లీకైపోతుంది. కట్ చేసిన తరువాత రిలీజైన ఫ్లూయిడ్స్ లోంచి ఇది లీకవుతుంది. ఐతే, ఫ్యాట్ తో క్యారీ చేయబడే విటమిన్స్ అంటే విటమిన్ డి వంటివి ఈజీగా లీక్ అవ్వవని గుర్తించాలి. 

కట్ చేయడం వల్ల కూడా రెస్పిరేషన్ రేట్ పెరుగుతుంది. ఫలితంగా, వీటిలో ఉన్న షుగర్స్ అనేవి విచ్చిన్నమవుతాయి. కార్బన్ డయాక్సయిడ్ రిలీజ్ అవుతుంది. దాంతో, ఇవి త్వరగా పాడైపోతాయి. వీటి టేస్ట్ లో అలాగే టెక్స్చర్ లో మార్పు వస్తుంది. టెంపరేచర్ తక్కువగా ఉంటే రెస్పిరేషన్ రేట్ తక్కువగా ఉంటుంది. అందుకే, ముందుగా తరిగిన వాటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. 

ఐతే బీ కాంప్లెక్స్ విటమిన్స్ అలాగే ఫైబర్ వంటివి కట్ చేసిన తరువాత అలాగే పీల్ చేసిన తరువాత లీకవడం జరగదు. 

ఎడిబుల్ స్కిన్ కలిగిన పండ్లు అలాగే కూరగాయలను స్కిన్ ను పీల్ చేయకుండా తినేయడం మంచిది. దాంతో వాటిలోని పోషకాలను నష్టపోవడం జరగదు. ఉదాహరణకు, ఆలూ, కేరట్ అలాగే దోసకాయల వంటివాటిని నీళ్లతో శుభ్రంగా కడిగేసి వాడుకోవాలి. న్యూట్రియెంట్ లాస్ పై టైమ్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. కాబట్టి, ప్యాకేజింగ్ పై డేట్ ను చూడడం ముఖ్యం. తాజావాటిని కొనాలి. ముఖ్యంగా ముందుగా తరిగిన వాటిని కొనేటప్పుడు మరింత తాజావాటిని కొనాలి. 

ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ నుంచి పోషకాలు కోల్పోకుండా ఉండాలంటే వాటి స్కిన్ ను తొలగించకుండా వాటిని అలాగే భద్రపరచాలి. మీరు వాడేటప్పుడే వాటి స్కిన్ ను పీల్ చేయాలి. ఒకవేళ వాటిని టైం సేవింగ్ పర్పస్ కోసం ముందుగానే తరిగితే వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లలో పెట్టి ఫ్రిడ్జ్ లో భద్రపరచాలి. 

కూరగాయలను తరగడం అలాగే కుక్ చేయడం వల్ల వాటిలో కెమికల్ గా అలాగే న్యూట్రిషనల్ గా మార్పులు వస్తాయి. నిజానికి, పండ్లు అలాగే కూరగాయాలలను మొక్క లేదా చెట్టు నుంచి హార్వెస్ట్ చేయగానే వాటిలోని న్యుట్రిషనల్ వాల్యూ తగ్గడం ప్రారంభమవుతుంది. కూరగాయలు అలాగే పండ్లలో న్యూట్రియెంట్ లాస్ ను తగ్గించేందుకు పోషకాహార నిపుణులు ఈ సూచనలు ఇస్తున్నారు. వెజిటబుల్స్ ను పదునైన కత్తితోనే తరగాలి. చిన్న చిన్న ముక్కలుగా తరగకూడదు. అలా చేస్తే పోషకాలు తగ్గిపోతాయి. ఒకవేళ చిన్నచిన్న ముక్కలుగా తరిగినా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వాటిని వాడేయమని సూచిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags