Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Laugh And Live Long - Laughing Benefits




Laugh And Live Long - Laughing Benefits
నవ్వండి, బోనస్‌గా ఆరోగ్యాన్ని పొందండి.. లాఫింగ్ వల్ల లాభాలివే!

=====================

‘World Smile Day’ –The First Friday of October: అక్టోబర్ మొదటి శుక్రవారం ప్రపంచ చిరునవ్వు దినోత్సవం గా జరుపుకుంటారు.

‘World Laughter Day’ - The First Sunday of May: మే నెలలోని మొదటి ఆదివారం ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’గా జరుపుకుంటారు.

=====================

మీరు, లేకపోతే మీ ఇంట్లోవాళ్లు నవ్వకుండా సీరియస్‌గా ఉంటున్నారా? అయితే, వారిని తప్పకుండా ఇది చదవమని చెప్పండి. కనీసం ఆరోగ్యం కోసమైనా నవ్వుతారు. నవ్విస్తారు!! 

నవ్వితే నాలుగు విధాలా చేటు అనడం పాత రోజులు. ఇప్పుడు నవ్వకపోతేనే ఆరోగ్యానికి చేటు. ఒక్కసారి ఆలోచించండి.. ఈ బిజీ లైఫ్‌లో మీరు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నవ్వారా? రోజంతా పనిలో ఉండి ముఖాన్ని సీరియస్‌గా మార్చుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇంటకి వెళ్లిన తర్వాత పిల్లలు, భార్య నవ్వుతూ పలకరించినా.. తిరిగి నవ్వలేని పరిస్థితి. ఇది మిమ్మల్ని క్రమేనా.. డిప్రషన్ అనే లోకానికి తీసుకెళ్లిపోతుందనే సంగతి మీకు తెలుసా? అయితే, నవ్వు తెచ్చే ఆరోగ్య ప్రయోజనాలను చూద్దామా. 

మితిమీరిన ఒత్తిడి, పోటీతత్వం తదితర సమస్యలు మనల్ని నవ్వు నుంచి దూరం చేయడమే కాదు నవ్వునే మరిచపోయేలా చేస్తున్నాయి. నలుగురితో కబుర్లు చెబుతూ కాసేపు నవ్వుకోవాలన్నా.. పని ఒత్తిడి వల్ల సాధ్యం కాదు. అయితే, నవ్వకపోవడం వల్ల మీరు ఏం కోల్పోతున్నారో తెలుసుకోవల్సిందే.

😀 మనకు వచ్చే రోగాల్లో 70 శాతం ఒత్తిడి వల్ల ఏర్పడేవే. గుండె జబ్బులు, డయబెటీస్, రక్తపోటు, డిప్రెషన్‌, ఇన్సోమియా, మైగ్రేన్‌, ఆతృత, అలర్జీ, పెప్టిక్‌ అల్సర్‌ తదితరాలన్నీ ఒత్తిడితో ముడిపడినవే. ఇవి తొలగిపోవాలంటే మీరు తప్పకుండా నవ్వాలి.

😀 నలుగురితో కలిసి సరదాగా నవ్వేవారికి, ఒంటరిగా ఉండే వ్యక్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని ఓ సర్వేలో తేలింది. తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువట.

😀నవ్వు వల్ల ఆందోళన దూరమై. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల శ్రావకాలు తగ్గుముఖం పడతాయట. పది నిమిషాలు నవ్వడం వల్ల 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుందట.

😀 నవ్వు వల్ల రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన లింపాజైట్స్ ఉత్పత్తి పెరుగుతుంది.

😀 నవ్వడం వల్ల ముక్కు, శ్వాసకోశాల్లోని పొరలు ఆరోగ్యంగా ఉంటాయి.

😀నవ్వు శరీరంలో సహజ రోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెంచుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్‌, స్పాండలైటిస్‌, మైగ్రేన్‌ లాంటి వ్యాధులు దరిచేరవు.

😀 నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతాయి.

😀 ఆస్తమా రోగులకూ సైతం నవ్వు మంచిదే. 

చూశారుగా నవ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలు. ఇప్పటికైనా మీ సీరియస్ ముఖాన్ని స్మైలీ ఫేస్‌గా మార్చేసుకోండి. బాగా నవ్వండి.. హాయిగా జీవించండి.

‘ప్రపంచ నవ్వుల మరియు చిరునవ్వుల దినోత్సవం సందర్భం గా ఈ క్రింద వీడియోలు చూసి నవ్వుకుంటారని ఆశిస్తున్నాము.😀😀😀

Previous
Next Post »
0 Komentar

Google Tags