Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mann ki Baat: Light a lamp for soldiers; Pick local products while shopping for festivals, says PM

 


Mann ki Baat: Light a lamp for soldiers; Pick local products while shopping for festivals, says PM

సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగించండి మోడీ

సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ.. శత్రువుల బారి నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతోన్న సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో మరోసారి గుర్తు చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీపావళి, ఈద్ వంటి పండుగల సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సరిహద్దులను, మనల్ని సురక్షితంగా కాపాడుతోన్న సైనికులను గుర్తు చేసుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో సైనికులు, భద్రతా దళాలకు యావత్ దేశప్రజలు మద్దతుగా ఉన్నామని గుర్తుచేస్తూ పండుగరోజు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ విధంగా స్పందించారు. ప్రతినెల రేడియా ద్వారా నిర్వహించే 'మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

పండుగలకు షాపింగ్ చేసేటప్పుడు స్థానిక ఉత్పత్తులను ఎంచుకోండి

కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. పండుగలు జరుపుకొనేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని దేశప్రజలకు ప్రధానమంత్రి సూచించారు. అంతేకాకుండా, కరోనా వైరస్ పై జరుగుతోన్న పోరులో తప్పకుండా విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తంచేశారు. పండుగల సమయంలో స్వదేశీ వస్తువులను కొనడానికే మొగ్గు చూపాలని.. ముఖ్యంగా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో కశ్మీర్ లోయలోని పుల్వామా ప్రాంతం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశానికి అవసరమయ్యే పెన్సిల్ కలపలో 90శాతం ఇక్కడ నుంచే తయారవుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం అక్కడి కొన్ని

గ్రామాలను పెన్సిల్ గ్రామాలుగా పిలుస్తున్నారని తెలిపారు. కృషితోపాటు స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందన్నారు.

వీటితోపాటు దేశాన్ని ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటివాటిలో భక్తి ఉద్యమం పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. త్రిపుర నుంచి గుజరాత్,

జమ్మూకశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ప్రజల విశ్వాసాలకు ప్రతీకలుగా ఉన్న పుణ్య క్షేత్రాలు యావత్ దేశాన్ని ఒక్కతాటిపై నడిపిస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే భక్తి ఉద్యమం భారత్ లోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా మారి యావత్ దేశ ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags