Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PM Modi Releases Special ₹ 100 Coin To Honour Vijaya Raje Scindia

 


PM Modi Releases Special ₹ 100 Coin To Honour Vijaya Raje Scindia

కొత్త రూ.100 కాయిన్ తీసుకువచ్చిన మోదీ.. ఈ నాణెం ప్రత్యేకత ఇదే!

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కొత్త రూ.100 నాణేన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. రాజమాత విజయ రాజే స్కిందియా గౌరవర్ధం ఈ కొత్త నాణేన్ని ఆవిష్కరించారు. ఈ నాణెం ప్రత్యేకలు ఏంటివో చూద్దాం. 

మరో కొత్త నాణెం మార్కెట్‌లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సరికొత్త కాయిన్‌‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజే ఈ కొత్త నాణేన్ని మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇది రూ.100 కాయిన్. ఒక వర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా మోదీ ఈ కాయిన్‌ను విడుదల చేశారు. 

విజయ రాజే స్కిందియా గౌరవర్థం మోదీ ఈ కాయిన్‌ను తీసుకువచ్చారు. గ్వాలియన్ రాజ మాతగా విజయ రాజే స్కిందియా‌ను చెప్పుకుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రూ.100 నాణేన్ని రూపొందించింది. అంటే ఆర్థిక శాఖనే ఈ కాయిన్‌ను డిజైన్ చేసింది. 

నాణేనికి ఒకవైపు రాజమాత విజయ రాజే స్కిందియా బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మకు ఒక వైపు విజయ రాజే స్కిందియా 100వ జయంతి అని రాసి ఉంటుంది. ఇది హిందీలో రాసి ఉంది. అలాగే ఇంగ్లీష్‌లో కూడా రాసి ఉంటుంది. ఇకపోతే కాయిన్‌కు మరోవైు అశోకుడి స్తంభం ఉంటుంది. దీనికి కింద రూ.100 అని రాసి ఉంటుంది. 

బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో రాజమాత విజయ రాజే స్కిందియా కూడా ఒకరు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్కిందియా, మధ్యప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ యశోధర రాజే స్కిందియా రాజమాత విజయ రాజే స్కిందియా కూతుళ్లు. రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య స్కిందియా ఈమెకు మనువడు.

Previous
Next Post »
0 Komentar

Google Tags