Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

River that ran through Thar desert 1,72,000 years ago found

 


River that ran through Thar desert 1,72,000 years ago found

థార్ ఎడారిలో లక్షా 72వేల సంవత్సరాల కిందట నది.. ఆనవాళ్లు గుర్తించిన పరిశోధకులు

ప్రస్తుతం ఏడారిగా ఉన్న థార్‌లో ఒకప్పుడు నదులు ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా గుర్తించారు. లక్షా 72 వేల సంవత్సరాల కిందట నది జీవించి ఉన్నట్టు పేర్కొన్నారు. 

దాదాపు 1,72,000 సంవత్సరాల కిందట థార్ ఎడారి గుండా ప్రవహించి అంతరించిపోయిన ఓ నదిని అంతర్జాతీయ పరిశోధకులు రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలో గుర్తించారు. ఈ నది రాతియుగం నాటి జనాభాకు జీవనాధారంగా ఉంది.. ఇప్పుడు శుష్క ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి సహాయపడింది.. అదే సమయంలో మానవ వలసలకు ఒక ముఖ్యమైన కారిడార్‌గా కూడా ఉపయోగపడింది. పరిశోధన ప్రకారం.. థార్‌ ప్రాంతంలో నాటి నది కార్యకలాపాల దశను సూచిస్తుంది. ఈ పరిశోధన ఫలితాలను ‘క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్’ ఆన్‌లైన్‌లో జర్నల్‌లో ప్రచురించారు. గతంలోనే ఈ జర్నల్ ప్రింట్ వెర్షన్‌లో థార్ ఎడారిలో 80వేల సంవత్సరాల కిందట నది జీవించి ఉన్నట్టు పేర్కొన్నారు. 

జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, చైన్నైలోని అన్నా యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్-కలకతా సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. బికనీర్ సమీపంలోని నాల్ గ్రామం వద్ద నది ఇసుక, స్థానిక క్యారీలోని కంకర నిక్షేపాలను 2014 నుంచి 2019 వరకు పరిశీలించారు. 

మేము ఉపయోగించిన ముఖ్య పద్ధతి ల్యూమినెసెన్స్ డేటింగ్.. నది ఇసుకలోని క్వార్ట్జ్ చివరిసారిగా కాంతికి గురైన వయస్సును లెక్కించడానికి సహాయపడింది’ అని పరిశోధనలో పాల్గొన్న జర్మన్ శాస్త్రవేత్త జేమ్స్ బ్లింక్‌హోరన్ అన్నారు. ‘ఇంతకు ముందు థార్‌లో 80,000-90,000 సంవత్సరాల కిందట నది ప్రవహించినట్టు లూని లోయలో ఆధారాలు లభించాయి.. ప్రస్తుతం దక్షిణ నుంచి మాహి, సబర్మతి, ఓర్సాంగ్ లోయలలో ఇలాంటి లభించిన ఆధారాలు ప్రకారం లక్ష సంవత్సరాల కిందట నది జీవించి ఉన్నట్టు తెలుస్తోంది’అని వ్యాఖ్యానించారు. 

థార్ ఇప్పుడు ఎడారి కావచ్చు, కానీ అనేక నదులు ఇక్కడ ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయి.. ఒకప్పుడు ఇక్కడ నదులు ఇసుక దిబ్బలతో అంతరించిపోయాయి.. నాల్ వంటి కొన్ని ప్రదేశాలలో మొదటిసారిగా బయటపడ్డ కంకర నిక్షేపాలు నదీ వ్యవస్థ నేరుగా గుర్తించడానికి మాకు సహాయపడ్డాయి’అని అన్నా యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఓషన్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags