Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RTGS system to become 24x7 from December this year: RBI governor

             RTGS system to become 24x7 from December this year: RBI governor

బ్యాంక్ కస్టమర్లకు RBI శుభవార్త.. ఇక ఆ సేవలు 24 గంటలూ అందుబాటులో!

రిజర్వు బ్యాంక్ తాజాగా బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ఆర్‌టీజీఎస్ సర్వీసులను రోజంతా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

ఫండ్ ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ - 24 గంటలూ సేవలు అందుబాటులోకి 

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించారు. ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ఆర్‌టీజీఎస్ సిస్టమ్ రోజంతా అందుబాటులో ఉంటుందని తెలిపారు. డిసెంబర్ నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఆర్‌టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలను పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్‌టీజీసీ విధానం బ్యాంకింగ్ పనివేళల్లో మాత్రమే డబ్బులు పంపగలం. 

ఇకపోతే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ సమీక్షలో కీలక వడ్డ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కీలక సారథ్యంలోని ఎంపీసీ కమిటీలోని ఆరుగురు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వైపు మొగ్గు చూపారు.

ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 4 శాతం వద్దనే నిలకడగానే ఉంది. అలాగే రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇకపోతే ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే రెపో రేటును 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిందని చెప్పుకోవచ్చు. కాగా ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి కొంత ఊరట కలిగే ఛాన్స్ ఉంది. వడ్డీ రేట్ల తగ్గుదల ఉండకపోవచ్చు.

కాగా కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ఆర్థిక వేత్తలను (జయంత్ వర్మ, అశిమా గోయల్, శశాంక భిందే) నియమించిన తర్వాత జరుగుతున్న తొలి ఎంసీపీ మీటింగ్ ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే ఆరుగురు సభ్యుల ఎంపీసీ మీటింగ్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు జరగాల్సి ఉంది. అయితే ఇది వాయిదా పడింది. స్వతంత్ర సభ్యుల నియామకం ఆలస్యం కావడం ఇందుకు ప్రధాన కారణం.

ఇకపోతే రిజర్వు బ్యాంక్ ఆగస్ట్ నెలలో జరిగి పాలసీ సమావేశంలో కూడా కీలక వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగింది. ఇకపోతే 2019 ఫిబ్రవరి నుంచి చూస్తే రిజర్వు బ్యాంక్ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించుకుంటూ వచ్చింది. అంటే రెపో రేటు ఈ కాలంలో 2.5 శాతం దిగివచ్చిందని చెప్పుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags