Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SI, Constable Jobs in BSF


SI, Constable Jobs in BSF

బి‌ఎస్‌ఎఫ్ ‌లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌, ఆస‌క్తి క‌లిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇంజినీరింగ్‌, ఎయిర్ వింగ్ గ్రూప్‌-సీలో ఖాళీగా ఉన్న 228 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌, జేఈ లేదా ఎస్సై, ఏసీ, హెచ్‌సీ, ఏఎస్సై పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 28 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://bsf.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం పోస్టులు: 228

కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (బీఎస్ఎఫ్‌)- 75

కానిస్టేబుల్ (ట్రెడ్స్‌మెన్‌)- 75

గ్రూప్ బీ ఇంజినీరింగ్ కేడ‌ర్‌- 52

గ్రూప్ సీ ఎయిర్ వింగ్ కేడ‌ర్‌- 22

గ్రూప్ సీ- 64

ఇంజినీరింగ్ కేడ‌ర్‌- 15

 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

వయసు: 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పీఎస్టీ, పీఈటీ, డ్యాక్యుమెంటేష‌న్‌, ట్రేడ్‌టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోలో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేదీ: ఇంజినీరింగ్ క్యాడ‌ర్ పోస్టుల‌కు- అక్టోబ‌ర్ 15, గ్రూప్ బీ ఇంజినీరింగ్ క్యాడ‌ర్‌, ఎయిర్ వింగ్‌, కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల‌కు- అక్టోబ‌ర్ 23, గ్రూప్ సీ పోస్టుల‌కు- అక్టోబ‌ర్ 28.

వెబ్‌సైట్‌: https://bsf.gov.in/ 

BSF Notification

Previous
Next Post »
0 Komentar

Google Tags