Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sitharaman announces LTC cash voucher scheme and Special festival advance

 

Sitharaman announces LTC cash voucher scheme and Special festival advance

ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ అదిరిపోయే శుభవార్త.. 2 కొత్త స్కీమ్స్ అందుబాటులోకి!

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. రెండు కొత్త స్కీమ్స్ తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.10 వేలు అందిస్తున్నారు. అది కూడా వడ్డీ లేకుండా. 

రెండు కొత్త స్కీమ్స్

కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు కీలక ప్రతిపాదనలు చేశారు. లీవ్ ట్రావెల్ కన్సీషన్ (ఎల్‌టీసీ) క్యాష్ వోచర్ స్కీమ్ ఒకటి. స్పెషల్ ఫెస్టివ్ అడ్వాన్స్ స్కీమ్ మరొకటి. ఈ రెండు స్కీమ్స్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్ కలుగనుంది. 

దేశంలో డిమాండ్ పెంచేందుకు నిర్మలా సీతారామన్ ఈ రెండు స్కీమ్స్‌ను తీసుకువస్తున్నారు. వీటి ద్వారా కన్సూమర్ స్పెండింగ్‌ను పెంచాలని భావిస్తున్నారు. ఎల్‌టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్‌తో ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద డబ్బులు పొందొచ్చు. ఇవి ఓచర్ల రూపంలో లభిస్తాయి. ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులతోపాటు ఇంకా టికెట్ ధరకు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చు. ఈ డబ్బులతో ఏమైనా ప్రొడక్టులు కొనుగోలు చేయాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు మాత్రమే నిర్వహించగలం. కాగా ఉద్యోగులు నాలుగేళ్లలో ఒకసారి ఎల్‌టీసీ పొందొచ్చు. 

కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రమే కాకుండా రాష్ట్రాలకు, ప్రైవేట్ సంస్థలకు కూడా ఎల్‌టీసీ స్కీమ్ వర్తిస్తుంది. ఇవి కూడా ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందితే.. అప్పుడు వీటి ఉద్యోగులకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇకపోతే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రూ.10,000 ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే అడ్వాన్స్ కింద పొందొచ్చు. 

ప్రిపెయిడ్ రూపే కార్డు రూపంలో ఈ డబ్బులు వస్తాయి. 2021 మార్చి 31లోపు ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద ఈ బెనిఫిట్ లభిస్తోంది. పది ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో ఈ రూ.10 వేలు చెల్లించాలి. నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు పండుగ సీజన్ ముందు అదిరిపోయే ఆఫర్ అందించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల పరిమితితో రూ.12,000 కోట్ల మొత్తాన్ని వడ్డీ రహిత రుణాల కింద అందించేందుకు రెడీగా ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags