Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Today Telangana EAMCET-2020‌ Results


TS: Today Telangana EAMCET‌-2020 Results
నేడే తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు - మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల
తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు  విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ తెలిపారు.

తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ తెలిపారు. ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in/ లో చూసుకోవచ్చని తెలిపిన ఆయన.. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి ఫలితాలు చూసుకోవచ్చన్నారు.

కరోనా కారణంగా ఈ ఏడాది ఎంసెట్‌ నిర్వహణ ఆలస్యమైంది. సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. 1లక్ష43 వేల165 మంది ప‌రీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:
ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదు చేసుకోవచ్చు.
ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు.
ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది.
ఈ నెల 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు.
ఈ నెల 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది.
30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు.
30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయించనున్నారు.
నవంబర్‌ 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags