Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Schools And Colleges To Reopen From Today With Covid Precautions

 


AP Schools And Colleges To Reopen From Today With Covid Precautions

ఏ‌పి : దాదాపు 7 నెలల తర్వాత బడులు షురూ.. మార్గదర్శకాలివే..!

మార్చి ఆఖరులో మూతపడ్డ విద్యాసంస్థలు దాదాపు ఏడు నెలల విరామం తరువాత తిరిగి ప్రారంభం అవుతున్నాయి. 

రాష్ట్రంలో నేటి నుంచి బడిగంటలు మోగనున్నాయి. చాలా రోజుల తర్వాత స్కూళ్లు, కాలేజీలు అత్యంత జాగ్రత్తల నడుమ పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్‌–19 కారణంగా మార్చి ఆఖరులో మూతపడ్డ విద్యాసంస్థలు దాదాపు ఏడు నెలల విరామం తరువాత తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఏయే తరగతుల విద్యార్థులు ఎప్పటినుంచి హాజరు కావాలనే విషయాలను స్పష్టం చేస్తూ సమగ్ర మార్గదర్శకాలతో షెడ్యూళ్లు విడుదలయ్యాయి. 

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్‌ అపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం విద్యాసంస్థల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు వేర్వేరుగా అకడమిక్‌ క్యాలెండర్లను ప్రకటించింది. 

ఆగస్టు వరకు క్లాసులు:

ఈ (2020–21) విద్యా సంవత్సరంలో స్కూళ్లు, కాలేజీలకు 5 నెలల కాలం వృథా అయ్యింది. ఈ దృష్ట్యా కోల్పోయిన పని దినాలను సర్దుబాటు చేసుకుంటూ సోమవారం నుంచి దశలవారీగా తరగతులను ప్రారంభిస్తున్నారు. స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలను ఏప్రిల్‌ 30 వరకు, డిగ్రీ, పీజీ తరగతులను ఆగస్టు వరకు కొనసాగించేలా అకడమిక్‌ క్యాలెండర్లను ప్రభుత్వం జారీ చేసింది. 

సిలబస్‌ను కుదించకుండా నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరేలా ముఖ్యమైన అంశాలన్నీ బోధించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులను హైటెక్, లోటెక్, నోటెక్‌గా విభజించి తరగతి గదిలో నేరుగా టీచర్లు బోధన చేస్తారు. విద్యార్థులు ఇంటివద్ద నేర్చుకొనేవి, ఆన్‌లైన్‌ ద్వారా బోధించేవిగా విభజించి బోధించేలా ప్రణాళిక రూపొందించారు. 

తరగతుల ప్రారంభం ఇలా..!

నేటి నుంచి 9, 10, 12 తరగతుల విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. నవంబర్‌ 23 నుంచి అన్ని స్కూళ్లలో 6 నుంచి 8 తరగతులు మొదలవుతాయి. డిసెంబర్‌ 14 నుంచి అన్ని స్కూళ్లలో 1 నుంచి 5 క్లాసులు, నవంబర్‌ 16 నుంచి ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ తరగతులు మొదలవుతాయి. నవంబర్‌ నెలంతా బడులు ఒంటిపూట (ఉదయం 9 నుంచి 1.30 వరకు) మాత్రమే ఉంటాయి. 

రోజు విడిచి రోజు:

మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.

తరగతి గదిలో విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు.

ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకూడదు.

రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.

విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న స్కూళ్లలో తరగతుల నిర్వహణపై హెడ్మాస్టర్లు షెడ్యూల్‌ రూపొందిస్తారు.

డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్‌ ప్రాఫెషనల్‌ కోర్సులకు సంబంధించి ఫస్టియర్‌ మినహా మిగిలిన తరగతులు నవంబర్‌ 2 నుంచి దశల వారీగా ప్రారంభం.

డిసెంబర్‌ 1 నుంచి డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్‌ ప్రాఫెషనల్‌ కోర్సులకు సంబంధించి ఫస్టియర్‌ తరగతలు ప్రారంభం.

Previous
Next Post »
0 Komentar

Google Tags