Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Clerk Prelims 2020 Admit Card Released

IBPS Clerk Prelims 2020 Admit Card Released

ఐబీపీఎస్‌ క్లర్క్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..!

IBPS Clerk prelims admit card 2020: రెండు రోజులు ఆల‌స్యంగా ఈరోజు అడ్మిట్ కార్డుల‌ను ఐబీపీఎస్ విడుల ‌చేసింది. 

క్ల‌ర్క్ ప్రిలిమ్స్‌ ప‌రీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఐబీపీఎస్‌ ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేసింది. షెడ్యూల్ ప్రకారం హాల్‌టికెట్లు ఈనెల 18న విడుద‌ల‌వాల్సి ఉంది. అయితే రెండు రోజులు ఆల‌స్యంగా ఈరోజు అడ్మిట్ కార్డుల‌ను ఐబీపీఎస్ విడుల ‌చేసింది. ఈనేప‌థ్యంలో ప‌రీక్ష కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ibps.in/ నుంచి హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐబీపీఎస్ ప్రిలిమ్స్ ప‌రీక్ష వ‌‌చ్చే నెల 5, 12, 13 తేదీల్లో జ‌రుగ‌నుంది. 

100 ప్రశ్నలు.. గంట టైమ్‌:

కంప్యూట‌ర్ ఆధారితంగా ఆన్‌లైన్‌లో జ‌రిగే ఈ ప‌రీక్ష‌ను గంట సేప‌ట్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 1 మార్కు చొప్పున వంద మార్కులు కేటాయించారు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కులు కోత‌విధిస్తారు. ఈ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన‌వారు మెయిన్స్ ప‌రీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.  

ఇక ‌మెయిన్స్ ప‌రీక్ష వ‌చ్చేఏడాది ఫిబ్ర‌వ‌రి 28న జ‌రుగ‌నుంది. వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2557 పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్ గ‌త నెల‌లో నోటిఫికేష‌న్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 23న ప్రారంభ‌మై.. న‌వంబ‌ర్ 6న ముగిసింది. 

హాల్‌టికెట్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి:

Step 1: Go to IBPS official website - https://ibps.in/

Step 2: On the homepage, tap on the link that reads, "Click here to Download Online Preliminary Exam Call Letter for CRP Clerks-X."

Step 3: On a new page, enter your credentials correctly to login.

Step 4: The IBPS Clerk prelims admit card 2020 will appear on your screen.

Step 5: Check all the details including your name, exam date before saving and taking a print.

Previous
Next Post »
0 Komentar

Google Tags