Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEFT RTGS And IMPS - Here is How to Choose the Best Mode to Transfer Money

 


NEFT RTGS And IMPS - Here is How to Choose the Best Mode to Transfer Money

ఆన్‌లైన్‌లో 3 రకాలుగా డబ్బులు పంపొచ్చు.. ఏ ఆప్షన్ ఎప్పుడు వాడాలంటే?

ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించాలంటే మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. వీటిని ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్

మూడు ఆప్షన్లు

ఎలా ఉపయోగించాలంటే..

దేశంలో డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కూడా డిజిటల్ చెల్లింపులకు కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో ఇతరులకు డబ్బులు పంపించడం కూడా పెరిగింది. బ్యాంక్ కస్టమర్లు ఆన్‌లైన్‌లో మూడు రకాలుగా డబ్బులు పంపొచ్చు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ అనేవి ఇవి. 

1. NEFT

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) విషయానికి వస్తే.. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఆప్షన్‌తో ఇతరులకు సులభంగా డబ్బులు పంపొచ్చు. ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బులు పంపొచ్చు. నెఫ్ట్ లావాదేవీలు 30 నిమిషాల చొప్పున సెటిల్ అవుతూ వస్తాయి. రూ.1 దగ్గరి నుంచి పంపొచ్చు. అదే బ్యాంక్‌కు వెళ్లి నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపితే మాత్రం చార్జీలు పడతాయి. 

2. RTGS

రియల్‌ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) ఆప్షన్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు. కనీసం రూ.2 లక్షలు పంపాలి. లేదంటే ఈ ఆప్షన్ ఉపయోగించలేం. ఎలాంటి చార్జీలు పడవు. బ్యాంకుకు వెళ్లి డబ్బులు పంపితే మాత్రం చార్జీలు పడతాయి. ప్రస్తుతం ఈ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటాయి.

From December 2020 RTGS To Be Available 24 Hours

3. IMPS

ఇక చివరిగా ఇమీడియాడ్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు. ఈ విధానంలో డబ్బులు వెంటనే ఇతరుల బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లిపోతాయి. కనీసం రూ.1 నుంచి డబ్బులు పంపొచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకే పంపగలం. ఈ సేవలు రోజులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags