Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Surprising Effects of Lack Of Sleep

 


Surprising Effects of Lack Of Sleep

నిద్రపై మీకు తెలియని షాకింగ్ విషయాలు

నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? రాత్రి నిద్రను పగటి వేళ భర్తీ చేస్తున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవల్సిందే. 

ఈ బిజీ లైఫ్‌లో ఎంతోమందికి కంటి నిండా నిద్ర కరువవుతోంది. రేపు అనేది లేదన్నట్లుగా.. అంతా నిద్రను మానుకుని మరీ తమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. కడుపు నింపే పని మీద శ్రద్ధ పెట్టడం మంచిదే. అది తప్పనిసరి కూడా. కానీ, మీరు పడే ఆ శ్రమకు లభించే ఫలితాన్ని చూడాలంటే.. బతికి ఉండాలి కదా?  

ఔను.. మీరు కంటి నిండా కునుకు తీయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదమని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలను తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నాయి. మీరు మీ వృత్తికి ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అంతే విలువను నిద్రకు కూడా ఇవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా రేయింబవళ్లు మొబైల్ ఫోన్లతో గడుపుతూ నిద్రకు దూరమవుతున్న ప్రతి ఒక్కరూ ఈ డేంజర్ జోన్‌లో ఉన్నారని, ఇకనైనా స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా నిద్రను ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా నిద్రలేమి వల్ల కలిగే కొన్ని షాకింగ్ సమస్యలను తెలియజేశారు.

ఎన్ని గంటలు నిద్రపోవాలి? 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం.. ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. కానీ, మీలో ఎవరైనా అన్ని గంటలు నిద్రపోతున్నారా లేదా అనేది మీలో మీరే ప్రశ్నించుకోండి. ఒకసారి మీరు నిద్రపోతున్న సమయాన్ని లెక్క వేసుకోండి. ఎనిమిది గంటల సరిపడే నిద్ర కోసం కచ్చితంగా ఒక టైమ్ టేబుల్‌ను సిద్ధం చేసుకోండి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత పడకపై వాలి హాయిగా నిద్రపోండి. ఇలా చేయపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

నిద్రలేమి మధుమేహానికి దారితీస్తుందా? 

టీనేజర్లకు నిద్ర చాలా మంచిది. కానీ, నేటి తరం టీనేజర్లలో చాలామంది పబ్‌జీ ఆడుతూ.. వెబ్‌సీరిస్‌లు చూస్తూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారు భవిష్యత్తులో మధుమేహానికి గురికావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని స్టడీలు కూడా స్పష్టం చేశాయి. ఈ వయస్సులో సరైన నిద్రలేకపోతే శరీరం.. రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణ సామర్థ్యం కోల్పోతుందట. అంతేగాక రోగ నిరోధక సమస్యలు ఏర్పడి వివిధ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉందట. 

నిద్ర కరువైతే.. బరువు పెరుగుతారా? 

ఓ అధ్యయనం ప్రకారం.. నిద్రలేమి వల్ల ఆకలి పుట్టించే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే కడుపు నిండిందనే భావన కలిగించే లెప్టిన్ హార్మోన్ చాలా తక్కువగా విడుదల అవుతుంది. ఫలితంగా ఆకలి పెరిగి ఎక్కువ ఆహారాన్ని తినేస్తారట. అతిగా ఆహారాన్ని తినడం వల్ల ఊబకాయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. బిట్రన్‌‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో నైట్ షిఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఊబకాయం, డయాబెటీస్ వంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిసింది. 

ఎక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? 

నిద్రపోవాలని చెప్పారు కదా అని రోజూ అదే పనిలో ఉండదు. ఎందుకంటే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అనార్థమే. అయితే, నిద్రను వయస్సులు వారీగా విభజించారు. పెద్దవాళ్లు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు. కానీ, 6 గంటల కంటే తక్కువ నిద్ర మాత్రం మంచిది కాదు. కనీసం 7 గంటలైన కంటి నిండా నిద్రించాలి. కొందరు సుమారు 9 నుంచి 10 గంటలు సేపు నిద్రపోతారు. అలాంటి నిద్ర కేవలం టీనేజర్లకు మాత్రమే మంచిదట. కానీ, 11 నుంచి 12 గంటల సేపు నిద్ర అస్సలు మంచి కదాట. ఇకపోతే.. అప్పుడే పుట్టిన పిల్లలు కనీసం 18 గంటలు నిద్రపోవాలట. వారితో ఆడుకుందాం కదా అని నిద్రకు భంగం కలిగించొద్దు. ఇక చిన్న పిల్లలైతే కనీసం 11 గంటలు నిద్రపోవాలి. కాబట్టి.. వారికి ఫోన్లు, టీవీలు అలవాటు చేసి వారి నిద్రను చెడగొట్టవద్దు. మంచి మంచి కథలు చెప్పి హాయిగా నిద్రపోయేలా మాయ చేయండి. 

పగటి వేళ నిద్రను భర్తీ చేసుకోవచ్చా? 

చాలామంది రాత్రివేళ మిస్సయిన నిద్రను.. పగటి వేళ భర్తీ చేసేద్దాం అని అనుకుంటారు. కానీ, దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. శరీరం రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం వేళల్లో చురుగ్గా ఉంటుందని, కానీ.. రాత్రి వేళ విశ్రాంతి లేకుండా చేసి.. ఉదయం వేళ బలవంతంగా విశ్రాంతి ఇవ్వడం వల్ల ఫలితం ఉండదని పేర్కొన్నాయి. ‘‘ఆకలి వేసినప్పుడే అన్నం తినాలి. నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలి. రాత్రి తినాల్సిన భోజనాన్ని.. మధ్యాహ్నానికి ఎలా వాయిదా వేసుకోలేమో.. అలాగే నిద్రను కూడా వాయిదా వేసుకోకూడదు’’ అని పరిశోధకులు ఉదాహరణగా పేర్కొన్నారు. స్వీడన్‌‌లోని స్టాక్‌హామ్‌లో గల కరోలినస్కా ఇనిస్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ సుసన్నా లరస్సాన్, షుయాయి యువాన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం పగటి వేళ నిద్రపోవడం, నిద్రలేమి సమస్యలు వల్ల ఎక్కువ మంది టైప్-2 డయాబెటీస్‌‌కు గురవ్వుతున్నారు. 

మెదడుపై ప్రభావం 

నిద్ర అంటే.. శరీరానికి విశ్రాంతి కల్పించడం. రోజంతా పని చేసి మనం విశ్రాంతి తీసుకోకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలిసిందే. శరీరంలో ఎంతో సున్నితంగా ఉండే మెదడుపై ఈ ప్రభావం రెండింతలు అధికంగా ఉంటుంది. ఎందుకంటే.. శరీరంలోని అన్ని క్రియలు సక్రమంగా జరిగేలా మానిటర్ చేసేది మెదడే. అందుకే, రాత్రివేళలో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో మెదడులో ఉండే వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. అలాగని 10 గంటలకు మించి అతిగా నిద్రపోతే మాత్రం మెదడులో మరో రకమైన సమస్య ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. 

స్మార్ట్‌ఫోన్లే విలన్లు 

టీనేజర్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. పుస్తకాలు కంటే మొబైళ్లతోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఫలితంగా ఆ ఫోన్లో ఉండే బ్లూ వయొలెట్ కిరాణాల ప్రభావం కళ్లపై పడి నిద్రలేమి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పెద్దవాళ్లు కనీసం 8 గంటలు నిద్రపోతే చాలు. టీనేజర్లు కనీసం 10 గంటలు నిద్రపోవాలి. కానీ, ఎవరూ అలా చేయడం లేదు. తెల్లవారే వరకు మొబైళ్లతోనే గడుపుతున్నారు. చాటింగులు, వెబ్‌సీరిస్‌, గేమ్స్‌తో నిద్రను వ్యర్థం చేసుకుంటున్నారు. మొబైళ్ల నుంచి వెలువడే నీలి కాంతి.. నిద్రను కలిగించే మెలటోనిన్‌ హార్మోన్ విడుదలకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది. దీనివల్ల టీనేజర్లు తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags