Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Transfer to Headmasters who have completed five years - Changes in Teacher Transfer Rules

 

Transfer to Headmasters who have completed five years - Changes in Teacher Transfer Rules

ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులకు బదిలీ - టీచర్ల బదిలీ  నిబంధనల్లో మార్పులు 

ఉపాధ్యాయ బదిలీల నిబంధనలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు ఒకటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. గతంలో 5 అకడమిక్‌ సంవత్సరాలు ఉండగా.. దానిని ఐదేళ్లుగా మార్పు చేసింది. ప్రస్తుత పాఠశాలలో ఎన్నేళ్లు పని చేస్తే అన్ని స్టేషన్‌ పాయింట్లు ఇస్తారు. గతంలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు పరిమితి విధించగా.. పని చేసిన కాలానికి పూర్తిగా పాయింట్లు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. సర్వీసు పాయింట్లు గరిష్ఠంగా 15 ఉండగా వీటిని 16.5 పాయింట్లుగా మార్పు చేసింది. 33 ఏళ్ల వరకు సర్వీసుకు పాయింట్లు కేటాయిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags