Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Global Teacher Award 2020: Maharashtra Teacher Won Rs 7 Crore Prize Money

 

Global Teacher Award 2020: Maharashtra Teacher Won Rs 7 Crore Prize Money

స్కూల్ టీచర్‌కు 7 కోట్ల అవార్డు.. సూపర్ టాలెంట్, మంచి మనసు

మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిసాలేకే గ్లోబర్ టీచర్ ప్రైజ్ 2020 దక్కింది. రూ.7.38 కోట్ల నగదు బహుమతి అందుకున్నారు. ప్రపంచం మెచ్చిన ఆ టీచర్ గురించి ఆసక్తికర వివరాలు..

దేశంలో ఓ మారుమూల గ్రామంలో ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇప్పుడు ప్రపంచమంతా తన గురించే మాట్లాడేలా చేశారు. పనిపట్ల ప్రేమ, వృత్తి పట్ల నిబద్ధత ఉండాలే గానీ ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో చూపించారు. టీచర్ల విలువ ఏమిటో ప్రపంచానికి తెలియజేశారు. మరీ ముఖ్యంగా.. భారతదేశాన్ని ప్రపంచానికి గురువుగా ఎందుకు పేర్కొంటారో నిరూపించారు. 

ప్రపంచం మెచ్చిన ఆ ఉపాధ్యాయుడి పేరు రంజిత్ సిన్హ్ దిసాలే. ఆయన వయసు 32 ఏళ్లు. ఇప్పుడు రూ.7.3 కోట్ల (1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) విలువైన నగదు బహుమతిని గెలుచుకొని వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ప్రపంచంలో ఉపాధ్యాయుడిగా అత్యంత ప్రభావం చూపి, వృత్తిలో అత్యుత్తమంగా నిలిచిన వారికి ఇచ్చే ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ ఈ ఏడాది రంజిత్ సిన్హ్‌ను వరించింది. 

రంజిత్‌ సిన్హ్‌ దిసాలే లాంటి ఉపాధ్యాయులు వాతావరణ మార్పుల లాంటి సమస్యలకు పరిష్కారం చూపగలరు. ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించగలరు. సమాజంలో అసమానతలను రూపుమాపి, ఆర్థిక వృద్ధికి తోడ్పాడు అందిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటివారు మన భవిష్యత్తునే మార్చగలరు.

స్టెఫానియా జియాన్నిని, యునెస్కో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ 

ఈ నగదు బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12,000 మంది పోటీ పడ్డారు. తుది దశ ఎంపికలో మొత్తం 10 మంది నిలవగా.. రంజిత్‌ సిన్హ్ విజేతగా నిలిచారు. భారత ప్రతిష్టను చాటారు. ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డును ‘వర్కే ఫౌండేషన్‌’ ఏటా అందజేస్తోంది. 2020 సంవత్సరానికి సంబంధించిన ఎంపిక కార్యక్రమం లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో గురువారం (డిసెంబర్ 3) జరిగింది. 

ఇంతకీ ఈ గురువు ఏం చేశారు?

రంజిత్‌ సిన్హ్ దిసాలే.. మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా పరిదేవాడి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎంతో ఇష్టంగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన రంజిత్ సిన్హ్.. విద్యార్థులకు పాఠాలు బోధించడంలో ఎప్పుడూ నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఈ తపనే ఆయణ్ని ఇప్పుడు ‘విశ్వ గురువు’గా నిలబెట్టింది. 

ప్రపంచం మెచ్చిన మహారాష్ట్ర టీచర్.. వందనాలు సార్! 

టీచర్ రంజిత్ సిన్హ్ అడుగుపెట్టిన ప్రభుత్వ పాఠశాల గోదాం, గోశాల మధ్య అధ్వాన్న స్థితిలో ఉంది. శిథిలావస్థలో ఉన్న ఆ బడి భవనాన్ని బాగు చేయించాలని సంకల్పించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పాటు పాఠాలను మాతృభాషలోకి తర్జుమా చేసి, వాటిని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఆడియో, వీడియో, కథల రూపంలో పాఠాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మంచి ఫలితాలు రాబట్టారు. 

పాఠశాలలో బోధన చేస్తూనే.. గ్రామస్థులతో ఒకడిగా కలిసిపోయారు రంజిత్ సిన్హ్. గ్రామంలో బాల్య వివాహాలను నిర్మూలించారు. అమ్మాయిలు 100 శాతం పాఠశాలకు హాజరయ్యేలా చొరవ తీసుకున్నారు. వారాంతాల్లో విద్యార్థులను సమీప ప్రాంతాలకు, వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి... సహజ వనరులు, సమాజం పట్ల అవగాహన కలిగించారు. 

అవార్డు ప్రకటన తర్వాత ఆ మాటతో మరిన్ని హృదయాలను గెలుచారు!

ప్రపంచాన్ని మార్చగలిగేది ఉపాధ్యాయులేనని రంజిత్ సిన్హ్ చెబుతున్నారు. సమాజానికి పంచి పెట్టడంలోనే వారు ఆనందం పొందుతారని చెప్పారు. అవార్డు గెలుచుకున్న తర్వాత ఆయన కీలక ప్రకటన చేశారు. తనకు వచ్చే ప్రైజ్‌ మనీలో సగం నగదును తోటి పోటీదారులకు పంచి ఇస్తానని తెలిపారు. 

ఉపాధ్యాయులుగా ఆయా దేశాల్లో వారెంతో కృషి చేస్తున్నారు. సమాజానికి ఇవ్వడంలోనే వారు ఎంతో ఆనందం పొందుతారు. అందుకే ప్రైజ్ మనీని పంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను’ అని రంజిత్ సిన్హ్ అన్నారు. 

50 శాతం సొమ్మును తనతో పోటీ పడిన 9 మంది ఉపాధ్యాయులకు పంచి పెట్టి, మిగిలిన సగ భాగం సొమ్ముతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని రంజిత్ సిన్హ్ తెలిపారు. వెనకబడిన తరగతుల విద్యార్థుల విద్య కోసం కృషి చేస్తానని చెప్పారు.

Previous
Next Post »

5 comments

  1. My 10th completed in 19-20. Now I am deploma. In Golden scolorship asking 11,and 12 details. What can I do how to apply

    ReplyDelete
    Replies
    1. https://www.tlm4all.com/2020/12/lic-golden-jubilee-scholarship-2020.html

      Delete
    2. Read Instructions in the post for clarity

      Delete

Google Tags