Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

జాతీయ గణిత దినోత్సవ వేడుకలు - 2020

 

జాతీయ గణిత దినోత్సవ వేడుకలు - 2020 

డైరెక్టర్ SCERT శ్రీ ప్రతాపరెడ్డి గారి ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యార్థులలో గణితం పట్ల ఆసక్తి పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు - 2020 జరగనున్నాయి. 

9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన (శ్రీనివాస రామానుజన్‌పై), సృజనాత్మక గణిత నమూనా తయారీ అంశాలపై పోటీలు నిర్వహించనుంది.

దీనిలో భాగంగా జిల్లాలలోని అన్నీ డివిజన్లలలోను Dy.E.O. ల ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి గణిత  దినోత్సవ పోటీలు నిర్వహించబడును.  

దీనిలో భాగంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు క్రింది పోటీలు నిర్వహించబడును.

నిర్వహించనున్న పోటీలు :

1.వ్యాసరచన (అంశం: శ్రీనివాస రామానుజన్)

2.సృజనాత్మక గణిత నమూనా తయారీ

 అర్హతలు :

- అన్ని యాజమాన్య పాఠశాలలో 9 & 10 తరగతులు చదివే విద్యార్థులు.

నిర్వహణా విధానం :

- మొదటి దశలో పోటీలు డివిజన్ స్థాయిలో Dy.E.O. ల ఆధ్వర్యంలోజరుగును. పోటీలో పాల్గొనే విద్యార్థులు ది.22-12-20 న డివిజన్ కేంద్రంలో  పోటీలలో పాల్గొనవలెను. 

- ప్రతిడివిజన్ నందు అత్యుత్తమ వ్యాసరచనవిజేత & అత్యుత్తమ గణిత నమూనా ఎంపిక చేయబడతాయి.(Only First places) 

- ది.30-12-20 న డివిజన్ స్థాయి విజేతలకు నేరుగా రాష్ట్ర స్థాయిలో పై రెండు అంశాలలో పోటీలు SCERT ఇబ్రహీంపట్నం నందు నిర్వహించ బడతాయి.

Indian Mathematicians - Prep by K Sreenivasa Raju Sir

విద్యావికాస సమితి – శ్రీనివాస రామానుజన్ జయంతి గురించి వ్యాసం 

Previous
Next Post »
0 Komentar

Google Tags