Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2020: Application to fill 452 SCO, Deputy Manager Posts

SBI Recruitment 2020: Application to fill 452 SCO, Deputy Manager Posts

ఎస్‌బీఐలో 452 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కి చెందిన సెంట్ర‌ల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్ర‌మోష‌న్ విభాగం రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు.. 

స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు 

మొత్తం ఖాళీలు: 452 

పోస్టులు-ఖాళీలు: మేనేజ‌ర్ (మార్కెటింగ్‌)-12, డిప్యూటీ మేనేజ‌ర్ (మార్కెటింగ్‌)-26, మేనేజ‌ర్ (క్రెడిట్ ప్రొసీజ‌ర్స్‌)-02, అసిస్టెంట్ మేనేజ‌ర్ (సిస్టం)-183,  డిప్యూటీ మేనేజ‌ర్ (సిస్టం)-17, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌-15, ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌-14, అప్లికేష‌న్ ఆర్కిటెక్ట్-05, టెక్నిక‌ల్ లీడ్‌-02, అసిస్టెంట్ మేనేజ‌ర్ (సెక్యూరిటీ అన‌లిస్ట్)-40, డిప్యూటీ మేనేజ‌ర్ (సెక్యూరిటీ అన‌లిస్ట్‌)-60, మేనేజ‌ర్ (నెట్‌వ‌ర్క్ సెక్యూరిటీ స్పెష‌లిస్ట్‌)-12, మేనేజ‌ర్ (నెట్‌వ‌ర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెష‌లిస్ట్‌)-20, డిప్యూటీ మేనేజ‌ర్ (ఇంట‌ర్న‌ల్ ఆడిట్‌)-28, ఇంజినీర్ (ఫైర్‌)-16 

అర్హ‌త‌:  

1) మేనేజ‌ర్‌, డిప్యూటీ మేనేజ‌ర్ (మార్కెటింగ్‌): మార్కెటింగ్‌/ ఫైనాన్స్‌లో ఫుల్ టైం ఎంబీఏ/ పీజీడీఎం/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత నైపుణ్యాలు ఉండాలి.

మేనేజ‌ర్‌(మార్కెటింగ్‌) సంబంధిత ఫీల్డ్‌లో ఐదేళ్లు, డిప్యూటీ మేనేజ‌ర్ క‌నీసం రెండేళ్ల అనుభ‌వం క‌లిగి ఉండాలి. క‌రస్పాండెన్స్‌/ పార్ట్ టైం ప‌ద్ధ‌తిలో కోర్సు పూర్తి చేసిన వారు అనర్హులు. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌(ఆబ్జెక్టివ్ టెస్ట్‌, డిస్క్రిప్టివ్ టెస్ట్‌), ఇంట‌రాక్ష‌న్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

2) మేనేజ‌ర్ (క్రెడిట్ ప్రొసీజ‌ర్స్‌): ఫుల్ టైం ఎంబీఏ/ త‌త్స‌మాన‌/ పీజీడీఎం/ పీజీడీబీఏ/ సీఎఫ్ఏ/ ఎఫ్ఆర్ఎం ఉత్తీర్ణ‌త‌తో సంబంధిత నైపుణ్యాలు ఉండాలి. క‌నీసం 6 ఏళ్ల అనుభ‌వం ఉండాలి. క‌రస్పాండెన్స్‌/ పార్ట్ టైం ప‌ద్ధ‌తిలో కోర్సు పూర్తి చేసిన వారు అనర్హులు. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

3) అసిస్టెంట్ మేనేజ‌ర్‌, డిప్యూటీ మేనేజ‌ర్‌, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌, ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, అప్లికేష‌న్ ఆర్కిటెక్ట్‌, టెక్నిక‌ల్ లీడ్‌: క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ/ ఈసీఈలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూట‌ర్ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌, సంబంధిత నైపుణ్యాలు ఉండాలి. క‌నీసం 8 ఏళ్ల అనుభ‌వం ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌(జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

4) అసిస్టెంట్ మేనేజ‌ర్‌, డిప్యూటీ మేనేజ‌ర్‌(సెక్యూరిటీ అన‌లిస్ట్‌): క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ/ ఈసీఈలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూట‌ర్ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌, సంబంధిత నైపుణ్యాలు ఉండాలి. క‌నీసం ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష(జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్‌)‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

5) మేనేజ‌ర్ (నెట్‌వ‌ర్క్ సెక్యూరిటీ స్పెష‌లిస్ట్‌, నెట్‌వ‌ర్క్ రూటింగ్ & స్విచ్చింగ్ స్పెష‌లిస్ట్‌): క‌నీసం 60% మార్కుల‌తో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత టెక్నిక‌ల్ నైపుణ్యాల్లో స‌ర్టిఫికెట్ కోర్సులు, క‌నీసం 6 ఏళ్ల అనుభ‌వం ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

6) డిప్యూటీ మేనేజ‌ర్ (ఇంట‌ర్న‌ల్ ఆడిట్‌): ఐసీఏఐ నుంచి చార్టెడ్ అకౌంటెన్సీ(సీఏ) ఉత్తీర్ణ‌త‌, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్‌, క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

7) ఇంజినీర్ (ఫైర్): స‌ంబంధిత స‌బ్జెక్టులో బీఈ/ బీటెక్‌/ గ‌్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత నైపుణ్యాలు, అనుభ‌వం ఉండాలి. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.12.2020. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.01.2021. 

ప‌రీక్ష తేది: 01.02.2021 (ప‌్ర‌క‌ట‌న‌లో సూ‌చించిన పోస్టుల‌కు) 

WEBSITE

CAREER PAGE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags