Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC-Junior Scientific Officer, Other Vacancies

 

UPSC-Junior Scientific Officer, Other Vacancies

యూపీఎస్సీ-జూనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, ఇత‌ర ఖాళీలు

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 29

1) జూనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీసర్‌: 01 పోస్టు

అర్హ‌త‌: మైక్రోబ‌యాల‌జీలో ఎమ్మెస్సీ/ బోట‌నీ(మైకాల‌జీ/ ప‌్లాంట్ పాథాల‌జీ/ మైక్రోబ‌యాల‌జీ)లో ఎమ్మెస్సీ/ అగ్రిక‌ల్చ‌ర్‌(సాయిల్ సైన్స్‌/ అగ్రిక‌ల్చ‌ర్ కెమిస్ట్రీ/ ఆగ్రాన‌మీ/  మైక్రోబ‌యాల‌జీ/ ప‌్లాంట్ పాథాల‌జీ/ హార్టిక‌ల్చ‌ర్‌/ అగ్రిక‌ల్చ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌)లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 33 ఏళ్లు మించ‌కూడ‌దు.

2) డైరెక్ట‌ర్(క‌న్జ‌ర్వేష‌న్)‌: 01 పోస్టు

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ/ స‌ంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ప‌దేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

3) డిప్యూటీ సూపరిటెండింగ్ ఆర్కియలాజిక‌ల్ ఇంజినీర్‌: 03

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ/ స‌ంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.సంబంధిత ప‌నిలో మూడేళ్ల‌ అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

4) అసిస్టెంట్ క్లినిక‌ల్ ఎంబ్రియాల‌జిస్ట్‌: 01 పోస్టు

అర్హ‌త‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

5) డ‌యాల‌సిస్ మెడిక‌ల్ ఆఫీస‌ర్: 05 పోస్టులు

అర్హ‌త‌: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు రొటేట‌రీ ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప‌నిలో క‌నీసం 6 నెల‌ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

6) స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్: 13 పోస్టులు

అర్హ‌త‌: ఎంబీబీఎస్, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

7) ఇంజినీర్‌, షిప్ స‌ర్వేయ‌ర్ క‌మ్ డిప్యూటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌: 05 పోస్టులు

అర్హ‌త‌: మెరైన్ ఇంజినీర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. ఐదేళ్లు(ఏడాది చీఫ్ ఇంజినీర్/ సెకండ్ ఇంజినీర్‌గా) స‌ముద్రంలో ప‌ని చేసిన అనుభ‌వం.

వ‌య‌సు: 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ఇంట‌ర్వ్యూ 100మార్కుల‌కు ఉంటుంది. ఇందులో అన్‌రిజ‌ర్వ్‌డ్‌/ ఈడ‌బ్ల్యూఎస్ 50 మార్కులు, ఓబీసీ-45 మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.25, ఎస్సీ/ ఎస్టీ/  పీహెచ్/ స‌్త్రీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.01.2021. 

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags