Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2020 Admissions: Second Phase Schedule from Today

 

AP EAMCET-2020 Admissions: Second Phase Schedule from Today

నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ

ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ నేటి (జనవరి 21) నుంచి ప్రారంభం కానుంది.

ఎంసెట్‌ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ నేటి (జనవరి 21) నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సంబంధిత ర్యాంకర్లు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం ఈనెల 25వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. మొదటి రౌండ్‌లో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లను ఈ దశ కౌన్సిలింగ్‌లో భర్తీ చేయనున్నారు. కాగా.. మొదటి దశలో సీట్లు పొందినా ఇప్పటి వరకు రిపోర్ట్ చేయని వారి సీట్లను సైతం ప్రస్తుతం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

WEBSITE

AP EAMCET 2020 SECOND PHASE NOTIFICATION

GO 77



Previous
Next Post »
0 Komentar

Google Tags