Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Online Counselling for Degree Admissions Starts Today

 

AP: Online Counselling for Degree Admissions Starts Today

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీలలో ప్రవేశాలకు బుధవారం నుంచి ఈనెల 17 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు  https://oamdc.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్‌ చదివిన విద్యార్థులు హాల్‌టిక్కెట్‌ నంబరు నమోదు చేసి, తల్లిదండ్రుల వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. ఇతర బోర్డుల ద్వారా ఉత్తీర్ణులైన వారు ధ్రువపత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 54 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 152 ప్రభుత్వ, 120 ఎయిడెడ్‌, 1,062 ప్రైవేటు, రెండు విశ్వవిద్యాలయ కళాశాలల్లో 4,92,820 సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 

WEBSITE

షెడ్యూల్‌ ఇలా...

* రిజిస్ట్రేషన్లు: 6 నుంచి 17 తేదీ వరకు

* కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు: 9-17

* సహాయ కేంద్రాలు: 6-12

* ఎన్‌సీసీ, క్రీడలు, మాజీ సైనికోద్యోగుల, దివ్యాంగుల పత్రాల పరిశీలన: 11-12

* సీట్ల కేటాయింపు: 20

* కళాశాలల్లో చేరికలు: 21-23 వరకు

Previous
Next Post »
0 Komentar

Google Tags