Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

మార్చి 5 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

 

మార్చి 5 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Refer News dated 18-02-2021

మేడ్చల్-మల్కాజి గిరి జిల్లాలోని హకీంపేటలో మార్చి 5 నుంచి 24 వరకు నిర్వహించతలపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు జిల్లా ఇన్‌చార్డ్ కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ర్యాలీ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో హకీం పేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూలో ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో కల్నల్ మనోజ్ మాట్లాడుతూ, రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులంతా ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో డీఆర్వో లింగ్యానాయక్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, కీసర ఆర్టీవో రవికుమార్, ఆర్ఎండినీ, విద్యుత్, స్పోర్ట్స్ అథారిటీ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన బ్రోచర్‌ను కల్నల్ మనోజ్ తో కలిసి శ్వేతా మహంతి విడుదల చేశారు.

http://www.joinindianarmy.nic.in/latest-rally-jcos-or.htm

Previous
Next Post »
0 Komentar

Google Tags