Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Board Exam 2021: Passing Marks Not Reduced to 23%, PIB Fact Check Clarifies

 

CBSE Board Exam 2021: Passing Marks Not Reduced to 23%, PIB Fact Check Clarifies

సీబీఎస్‌ఈ పరీక్షలు: ఆ వార్తలు నిజం కాదు!

సీబీఎస్‌ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని కుదించినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆన్‌లైన్‌లో వ్యాప్తి అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ ‘పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌’ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను 33శాతం నుంచి 23శాతానికి కుదించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో ఉన్న సమాచారం నిజం కాదు. ఉత్తీర్ణత మార్కులకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు’ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ స్పష్టం చేసింది. 

సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను 33శాతం నుంచి 23శాతానికి కుదిస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రకటించిందనేది ఆ పోస్ట్‌ సారాంశం. ఆ పోస్ట్‌లోని ఫొటోలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను కూడా జత చేశారు. దీంతో దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు స్పష్టత కోసం కేంద్ర విద్యాశాఖను సంప్రదించడం ప్రారంభించడం గమనార్హం. 

కాగా సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి ప్రారంభమవుతాయని పోఖ్రియాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీబీఎస్‌ఈ పరీక్షలు తగ్గించిన సిలబస్‌తోనే ఉంటాయని ఇటీవల కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags