Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Board Exam Classes 10, 12 Date Sheet Is Fake, Warns Government

 

CBSE Board Exam Classes 10, 12 Date Sheet Is Fake, Warns Government

సీబీఎస్‌ఈ: ఆ బోర్డు పరీక్షా డేట్‌షీట్‌ను నమ్మొద్దు

ఈ ఏడాది మే 4వ తేదీ నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఇటీవల వెల్లడించారు. ఆ తర్వాత నుంచి సీబీఎస్‌ఈ పరీక్షల డేట్‌షీట్(ఏయే తేదీన ఏ పరీక్షలు ఉంటాయో చెప్పే షీట్‌) ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే అది నకిలీ షెడ్యూల్‌ అని, దాన్ని నమ్మొద్దని కేంద్రం తాజాగా వెల్లడించింది. పరీక్షలకు సంబంధించి బోర్డు ఇంకా డేట్‌ షీట్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. 

సీబీఎస్‌ఈ డేట్‌షీట్‌ పేరుతో ఓ డాక్యుమెంట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. అందులో ఇది నకిలీ షెడ్యూల్‌ అని తేలింది. ఈ విషయాన్ని పీఐబీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అయితే కేంద్రమంత్రి పోఖ్రియాల్‌ చెప్పినట్లు పరీక్షలు మాత్రం మే 4 నుంచి జూన్‌ 10 వరకు జరగనున్నట్లు వెల్లడించింది. 

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను మే 4 నుంచి నిర్వహించనున్నట్లు గతేడాది డిసెంబరు 31న రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని తెలిపారు. జులై 15న పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఈ పరీక్షలు ఫిబ్రవరి-మార్చి మధ్య జరుగుతాయి. అయితే  కరోనా నేపథ్యంలో విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడటంతో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తమకు మరింత సమయం ఇవ్వాలని విద్యార్థులు ట్విటర్‌ వేదికగా అభ్యర్థించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. పరీక్షలను మూడు నెలలు ఆలస్యంగా నిర్వహించనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags