Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Election Commission To Launch Digital Voter-ID Cards On Jan 25

 

Election Commission To Launch Digital Voter-ID Cards On Jan 25

మొబైల్‌లోనే ఓటరు గుర్తింపు కార్డు - 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్‌

ఓటరు గుర్తింపు కార్డుల కోసం ఇకపై మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌ ఫోన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన  ఈ-ఎపిక్‌ కార్యక్రమాన్ని జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించనుంది. దీని ద్వారా మొబైల్‌ యాప్‌ లేదా ఓటర్‌ పోర్టళ్ల ద్వారా ఈ సేవలు పొందవచ్చు. పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో వచ్చే గుర్తింపు కార్డును ఎక్కడైనా ప్రింట్‌ తీసుకునే వీలుంటుంది. మొబైల్‌లోనూ డౌన్‌లోడ్‌ చేసుకుని సేవ్‌ చేసుకోవచ్చు. ఈ-ఎపిక్‌ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘ఈ -ఓటర్‌ హువా డిజిటల్‌.. క్లిక్‌ ఫర్‌ ఎపిక్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు ఈ నెల 25 నుంచి 31వ తేదీ మధ్య రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ ఫోన్‌ల ద్వారా ఈ-ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసువచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌  వినియోగదారులు, ఐఓఎస్‌ వినియోగదారులు యాప్ ద్వారా కూడా ఎలక్ర్టానిక్‌ ఓటర్‌ గుర్తింపు కార్డులు తీసుకోవచ్చు.

WEBSITE 1WEBSITE 2





Previous
Next Post »
0 Komentar

Google Tags