Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రశ్నల సాధనకు వాట్సప్‌ - ‘ఇంటింటా చదువుల పంట’కు విద్యాశాఖ శ్రీకారం

 

TS: ప్రశ్నల సాధనకు వాట్సప్‌  - ‘ఇంటింటా చదువుల పంట’కు విద్యాశాఖ శ్రీకారం 

పాఠశాల విద్యార్థులు వాట్సప్‌ ఆధారంగా వారం వారం ఆయా సబ్జెక్టుల ప్రశ్నలను సాధన చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఇంటింటా చదువుల పంట పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1-10 తరగతుల విద్యార్థులు వాట్సప్‌ నంబరు(8595524405)ను సేవ్‌ చేసుకొని ప్రతివారం హాయ్‌/హలో/నమస్తే అని సందేశం పంపితే చాలు ఆయా సబ్జెక్టులకు సంబంధించి.. పది ప్రశ్నల చొప్పున వాట్సప్‌కు వస్తాయి. మీరు వాటిని నింపితే కీతో పాటు ఎన్ని సరైన జవాబులు రాశారో కూడా వస్తుంది. తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. 1-8 తరగతులకు ఇప్పటికే ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా. 9, 10 తరగతులకు జ‌న‌వ‌రి 11వ తేదీ నుంచి మొదలవుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags