Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp Delays New Privacy Policy Rollout After User Backlash, Confusion

 

WhatsApp Delays New Privacy Policy Rollout After User Backlash, Confusion

వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ అప్డేటు వాయిదా

వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన పైవసీ పాలసీ అప్డేటు మరికొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

అప్డేట్ పై వస్తున్న అసత్య ప్రచారాలు, వినియోగదారుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. దీంతో వినియోగదారులకు పాలసీపై సమీక్షించుకునేందుకు మరింత సమయం లభిస్తుందని వివరించింది. ముందుగా నిర్ణయించిన విధంగా ఫిబ్రవరి 8న కాకుండా పాలసీని మే 15నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాలు నిలిపివేయడం జరగదని స్పష్టం చేసింది.

కొత్త ప్రైవసీ విధానంపై వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. మూడు నెలల పాటు అప్‌డేట్‌ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా..తాజా నిర్ణయంతో అది మరికొంత కాలం నిలిచిపోనుందని తెలిపింది. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై ఇటీవల వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

కొత్త ప్రైవసీ విధానంలో వ్యక్తిగత సంభాషణలు సహా ప్రొఫైల్‌ సంబంధిత ఇతర వివరాలేవీ ఫేస్‌బుక్‌తో పంచుకోవడం ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ అప్‌డేట్‌ కేవలం బిజినెస్‌ చాట్స్‌లో వినియోగదారులు వాట్సాప్‌ ద్వారా కంపెనీ కస్టమర్‌ కేర్‌తో మాట్లాడడానికి సంబంధించింది మాత్రమేనని వివరించింది. కేవలం బిజినెస్‌ ఫీచర్స్‌ను మరింత మెరుగ్గా యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది . వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్‌‌గానీ, ఫేస్‌బుక్‌గానీ చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లోకేషన్‌ షేరింగ్‌ను కూడా చూడలేమని తెలిపింది. ఫిబ్రవరి 8న ఏ ఒక్కరి ఖాతా రద్దు కాదని స్పష్టం చేసింది. ఈ మూడు నెలల కాలాన్ని ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించేందుకు వినియోగించుకుంటామని తెలిపింది. వినియోగదారులు కొత్త విధానాన్ని క్రమంగా అర్థం చేసుకొని అంగీకరించిన తర్వాతే అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. 

కొద్ది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూజర్స్‌ వాట్సాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే అందుకు సంబంధించిన విధివిధానాలతో కూడిన జాబితాను చూపిస్తూ ఒక పాప్-అప్‌ విండో ప్రత్యక్షమైంది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీపై యూజర్స్‌ అంగీకరించాలన్నది దాని సారాంశం. ఇందులో భాగంగా యూజర్స్ వ్యక్తిగత సమాచారంతోపాటు ఐపీ అడ్రస్‌ వంటి వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటారని వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై వాట్సాప్ స్పందిస్తూ కేవలం వాట్సాప్‌ బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌ బిజినెస్‌ ఖాతాలతో పంచుకుంటామని, వాటిని మాత్రమే వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగిస్తామని తెలిపింది. అయితే, ప్రజల్లోకి తాజా అప్‌డేట్‌పై తప్పుడు సమాచారం వెళ్లినందున.. వారి సందేహాలను నివృత్తి చేసేందుకు తాత్కాలికంగా అప్‌డేట్‌ను వాయిదా వేసింది..

Previous
Next Post »
0 Komentar

Google Tags