Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: బీఈడీ కళాశాలల్లో ఫీజుల నిర్ధారణ

 

AP: బీఈడీ కళాశాలల్లో ఫీజుల నిర్ధారణ

బీఈడీ కళాశాలల్లో ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2020-21 నుంచి 2022-23 మధ్య విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ధారించింది. ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో బీఈడీ కోర్సులకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఫీజులు వసూలు చేయాలంది. ఇందులోనే వార్షిక, ట్యూషన్ ఫీజు, అఫిలియేషన్ తదితరాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ఫీజుల విధానమే 374 ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో బీఈడీ కోర్సుకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags