Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రధానోపాధ్యాయుల కరదీపిక - Headmaster's Hand Book By SCERT, AP

 

ప్రధానోపాధ్యాయుల కరదీపిక - Headmaster's Hand Book By SCERT, AP

నేటి విద్యా విధానం శాస్త్ర సాంకేతికాభివృద్ధి వలన వచ్చిన మార్పుల ద్వారా నూతన ఒరవడులతో తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఇదే క్రమంలో సంపూర్ణమైన విధి నిర్వహణ కోసం ప్రధానోపాధ్యాయులకు కరదీపికను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మీ ముందుకు తీసుకొస్తుంది. విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వం పెంపొందించడంతో పాటు ప్రధానోపాధ్యాయుల్లో సానుకూల దృక్పధాన్ని, విశ్లేషణాశక్తిని, సృజనాత్మకతను పెంపొందించి తద్వారా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల ఆధారంగా ఆశించిన అభ్యసనా ఫలితాలను సాధించడానికి వినూత్న వ్యూహాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాం. వివిధ కోణాల్లో విద్యాబోధన, అభ్యసనా ఫలితాలు మరియు పరిశోధనల పట్ల మరింత దృష్టి సారించాము. అందుకుగాను ఆశావాద దృక్పథంతో విద్యార్ధి కేంద్రీకృతంగా విద్యా సంస్కరణలను, వినూత్న విద్యా విధానాలను అమలుపరుస్తున్నాము.

ఇటీవల కాలంలో నిర్వహించిన టీచర్స్ నీడ్ ఐడెంటిఫికేషన్ సర్వే (TNIS), నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (NAS), స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (SLAS) లలో వచ్చిన ఫలితాలను విశ్లేషించి విద్యా ప్రమాణాల ద్వారా ఆశించిన అభ్యసన ఫలితాల సాధనకు అనుసరించవలసిన బోధనా వ్యూహాలను నిర్దేశించుకున్నాము. ఈ కరదీపిక ప్రధానోపాధ్యాయులకు సమర్థవంతమైన పర్యవేక్షణతో పాటు అభ్యసనా ఫలితాలను సాధించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ కరదీపిక ప్రధానోపాధ్యాయులకు సమర్ధవంతమైన పర్యవేక్షణతో పాటు వారిలో ప్రేరణ, నూతనోత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచనా ధృక్పథాన్ని, పరిపాలనా దక్షతను పెంపొందించి, సమయపాలనతో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి దోహద పడుతుంది.

DOWNLOAD

Previous
Next Post »

1 comment

Google Tags