Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt To Supply Fortified Rice Through ICDS, MDM Scheme from April

 

Govt To Supply Fortified Rice Through ICDS, MDM Scheme from April

ఏప్రిల్ నుంచి బలవర్ధకమైన బియ్యం - ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలకు సరఫరా

పోషకాహార సరఫరాలో భాగంగా ఏప్రిల్‌ నుంచి ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకాలకు బలవర్థకమైన బియ్యం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆహార మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఈ విధమైన బియ్యం సరఫరాకు 15 రాష్ట్రాలను ఎంపిక చేయగా, అందులో ఆరు రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాకు ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఈ బియ్యాన్ని అందజేస్తున్నారు.

2019-20లో ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజల్లో రక్తహీనత, సూక్ష్మ పోషకాల కొరతను నివారించాలన్నదే ఈ పథక ఉద్దేశం. ‘65 శాతం ప్రజలు ప్రధాన ఆహారంగా బియ్యం వాడుతున్నారు. వీరికి బలవర్థకమైన బియ్యం అందిస్తే పోషక విలువలు పెంచడమే కాకుండా రక్తహీనత వంటి సమస్యలను సులువుగా ఎదుర్కొనవచ్చ’ని ఆ అధికారి తెలిపారు. దాదాపు రెండేళ్ల కిందట పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈ జనవరి వరకు 94,574 టన్నుల బలవర్థకమైన బియ్యం పంపిణీ చేశారు. కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారి తెలిపారు. మహిళా శిశు సంక్షేమశాఖ, పాఠశాల విద్య విభాగాలు పై పథకం అమలు ద్వారా పడే అదనపు ఆర్థికభారాన్ని (కేజీపై 73 పైసలు) భరించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. దేశంలో మొత్తం 28 వేల మంది రైస్‌మిల్లర్లు ఉండగా.. బలవర్థకమైన బియ్యం సరఫరాకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) వారికి ఆదేశాలు జారీ చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags