KVS Admissions 2021-22 Notification Released, Check the Guidelines and Important Dates
KVS Admission 2021: కేంద్రీయ
విద్యాలయాల్లో అడ్మిషన్లకు పూర్తి వివరాలివే
కేంద్రీయ విద్యాలయాల్లో 1వ
తరగతి ప్రవేశాలు
ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఏప్రిల్ 19
దరఖాస్తుకు ఆఖరు తేది
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) 1వ తరగతి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరానికి (2021-22) గాను కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 19న సాయంత్రం 7 గంటలకు ముగియనున్నాయి.
ఆసక్తి కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://kvsonlineadmission.kvs.gov.in/ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) వెల్లడించింది. ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన మొదటి జాబితాను ఏప్రిల్ 23న ప్రకటించనున్నారు. రెండో జాబితాలను ఏప్రిల్ 30న, తుది జాబితాను మే 5న వెల్లడిస్తారు.
అదేవిధంగా రెండో తరగతి, ఆపై
తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 8 (ఉదయం 8 గంటలకు) నుంచి ఏప్రిల్ 15 (సాయంత్రం 4 గంటలు) వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్‌సైట్
https://kvsangathan.nic.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని
సూచించింది.
0 Komentar