Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

No new Rs 2,000 notes printed since 2019: MoS Anurag Thakur

 

No new Rs 2,000 notes printed since 2019: MoS Anurag Thakur

గత 2 సంవత్సరాలలో  ₹2000 నోట్లు ముద్రించబడలేదు: ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

నోట్ల రద్దు తర్వాత తొలిసారి వెలుగులోకి వచ్చిన రెండు వేల రూపాయిల నోటు, గత రెండేళ్లుగా ప్రింటింగ్‌కు నోచుకోలేదట. వీటి సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభలో తెలియజేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్‌ నుంచి ఒక్క నోటు కూడా ముద్రణ జరగలేదని తెలిపారు. 

2018 మార్చి 30 నాటికి 3,362 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయని ఠాకూర్‌ తెలిపారు. సంఖ్యాపరంగా మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా, విలువ పరంగా 37.26 శాతంతో సమానమని తెలిపారు. 2021 ఫిబ్రవరి 26 నాటికి 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయని చెప్పారు. సంఖ్యా పరంగా ఈ వాటా 2.01 శాతం కాగా, విలువ పరంగా 17.78 శాతమని తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్‌బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాకూర్‌ తెలిపారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయిల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఎలాంటి ఇండెంట్‌ వెళ్లలేదని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags