Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NPCI Launches UPI-Help on BHIM App

 

NPCI Launches UPI-Help on BHIM App

'యూపీఐ-హెల్ప్' ను ప్రారంభించిన ఎన్‌పీసీఐ

యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ‘బీమ్’ యాప్‌లో 'యూపీఐ-హెల్ప్' అనే ఆప్షన్ ను సోమవారం ప్రారంభించింది. యూపీఐ లావాదేవీలు చేసే వారు బీమ్ యూపీఐ యాప్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయడంలో యూపీఐ-హెల్ప్ సహాయపడుతుంది. అదే విధంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చేసే లావాదేవీల విషయంలో తలెత్తే సమస్యలకు సంబంధించి ఆన్‌లైన్‌లో చేసే ఫిర్యాదులను కూడా యూపీఐ-హెల్ప్ పరిష్కరిస్తుంది.

బీమ్ యూపీఐ యూజర్లు తమ యాప్‌ను కింది వాటి కోసం ఉపయోగించుకునేలా యూపీఐ-హెల్ప్ సహాయం చేస్తుంది. 

1. పెండింగ్‌లో ఉన్న లావాదేవీల స్టేటస్ ను తనిఖీ చేయండి. 

2. ప్రాసెస్ చేయని లేదా లబ్ధిదారునికి నగదు జమ అవ్వని లావాదేవీలపై ఫిర్యాదు చేయడం. 

3. వ్యాపార లావాదేవీలపై ఫిర్యాదు చేయడం.

ప్రస్తుతం యూపీఐ-హెల్ప్ ఆప్షన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారుల బీమ్ యాప్‌లో అందుబాటులో ఉంది. త్వరలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, టీజేఎస్బీ సహకారి బ్యాంకు వినియోగదారులు కూడా యూపీఐ-హెల్ప్ ప్రయోజనాన్ని పొందుతారని ఎన్‌పీసీఐ తెలిపింది. అలాగే ఇతర బ్యాంకులు కూడా యూపీఐ-హెల్ప్ ప్రయోజనాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నాయని ఎన్‌పీసీఐ తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags