TS Covid-19 Media Bulletin 25-03-2021
తెలంగాణలో కొత్తగా 493 కొవిడ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ
పెరుగుతున్నాయి. వారం రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ
వస్తోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 56,464 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, 493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల
సంఖ్య 3,04,791కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ
గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో నలుగురు మృతిచెందారు.
దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1680కి చేరింది.
కరోనా బారి నుంచి నిన్న 157 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు
కోలుకున్న వారి సంఖ్య 2,99,427కి చేరింది. రాష్ట్రంలో
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,684 ఉండగా, వీరిలో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స
పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 138 కేసులు
నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 98,45,577కి చేరింది.
0 Komentar