తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో
పరీక్షల నిర్వహణపై వర్సిటీల క్లారిటీ
తెలంగాణలోని జేఎన్‌టీయూ, ఉస్మానియా
వర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో పరీక్షలు యథాతథంగా
జరుగుతాయని ఆయా వర్సిటీలు స్పష్టం చేశాయి.
తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై విశ్వవిద్యాలయాలు క్లారిటీ ఇచ్చాయి. పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని, కొవిడ్ వల్ల రాయలేని వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రత్యేక పరీక్షను రెగ్యులర్‌గానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓయూ పరిధిలో రేపు జరగబోయే పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు ఓయూ కంట్రోలర్ వెల్లడించారు. అలాగే కేయూ పరిధిలో జరగనున్న ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, హోటల్ మేనేజ్‌మెంట్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి.
0 Komentar