Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Airtel and Apollo 24/7 Join Hands to Provide E-Healthcare Services

 

Airtel and Apollo 24/7 Join Hands to Provide E-Healthcare Services

ఇళ్ల వద్దకే వైద్యసేవలు - అపోలో 24/7, ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యం

అపోలో హాస్పిటల్స్‌కు చెందిన హెల్త్‌కేర్‌ మొబైల్‌ యాప్‌ అపోలో 24/7, టెలికామ్‌ సేవల సంస్థ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి ఇ-హెల్త్‌కేర్‌ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించాయి. వైద్యుల ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ సేవల నుంచి డయాగ్నస్టిక్స్‌, ఫార్మసీ, వెల్‌నెస్‌ సేవలు అపోలో 24/7 హెల్త్‌కేర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా లభిస్తాయి.

ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా ఈ సేవలను వినియోగించుకునే వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఎయిర్‌టెల్‌ ప్రీమియర్‌ వినియోగదార్లకు, 12 నెలల పాటు ‘అపోలో సర్కిల్‌’ సభ్యత్వం లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ గోల్డ్‌ వినియోగదార్లకు 3 నెలల పాటు సభ్యత్వం లభిస్తుంది. డిజిటల్‌ హెల్త్‌ సేవల విస్తరణకు ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని అపోలో 24/7 సీఈఓ ఆంథోనీ జాకబ్‌ పేర్కొన్నారు. అపోలోతో కలిసి వైద్య సేవలను ప్రజలకు వారి ఇళ్లవద్దే అందించనున్నామని ఎయిర్‌టెల్‌ ముఖ్య మార్కెటింగ్‌ అధికారి శాశ్వత్‌ శర్మ వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags