Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IT Department Launches Offline Utility for ITR 1, 4

 

IT Department Launches Offline Utility for ITR 1, 4

ఐటీఆర్‌-1, 4 ఫారాల్ని సమర్పించేందుకు ఆఫ్‌లైన్‌ యుటిలిటీ సదుపాయం

పన్ను చెల్లింపుదార్లు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2021-22 మదింపు సంవత్సరం) ఐటీఆర్‌-1, 4 ఫారాల్ని సమర్పించేందుకు ఆఫ్‌లైన్‌ యుటిలిటీ సదుపాయాన్ని ఐటీ విభాగం ప్రారంభించింది. ఇది ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. జావాస్క్రిప్ట్‌ ఆబ్జెక్ట్‌ నొటేషన్‌ అనే నూతన సాంకేతిక విధానంతో ఈ ఫారాలను తీసుకొచ్చినట్లు, వీటిలో సమాచారాన్ని చాలా సులువుగా నింపొచ్చని ఐటీ విభాగం తెలిపింది.

ఈ ఆఫ్‌లైన్‌ ఫారాల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, కంప్యూటర్లలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌ 7 లేదా దాని తరవాత వెర్షన్‌ అందుబాటులో ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఆఫ్‌లైన్‌ యుటిలిటీ ప్రస్తుతానికి ఐటీఆర్‌-1, 4 ఫారాలకు మాత్రమే అందుబాటులో ఉందని, మిగతా ఫారాలకు కూడా ఈ విధానాన్ని తర్వాత తీసుకొస్తామని వివరించింది. ఐటీఆర్‌-1, 4 ఫారాలను ఎలా సమర్పించాలో తెలిపింది. ఐటీఆర్‌ ఫారం 1 (సహజ్‌), ఐటీఆర్‌ ఫారం 4 (సుగమ్‌) చాలా సరళంగా ఉంటాయి. చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదార్లు వీటిని సమర్పిస్తుంటారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags