AP: 1 నుంచి 9 తరగతులకు సెలవులు – పది, ఇంటర్
పరీక్షలు యథాతథం
G.O.Rt.No.111 Dt:-19-04-2021 ప్రధానాంశాలు
★ 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు 20-04-2021 నుండి వేసవి సెలవులు.
★ సమ్మేటివ్-2 పరీక్షల రద్దుతో 1 నుండి 9 తరగతుల విద్యార్థులు ఆటోమాటిక్ గా పై తరగతుల కు ప్రమోట్ చేయబడుతున్నారు.
★ 10వ తరగతి క్లాసులు మరియు పరీక్షలు యథాతధం
★10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఇవ్వబోయే టైం టేబుల్ ఆధారంగా అన్ని పనిదినాలలో తరగతులు నిర్వహించే విధంగా పాఠశాల కు హాజరు కావాలి.
★ కాబట్టి మిగిలిన వారు, ముఖ్యంగా ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరు కానవసరం లేదు.
★ 1నుండి9 తరగతులకు డ్రై రేషన్ సరఫరా మరియు 10వ తరగతి వారికి పాఠశాలలో మధ్యాహ్న బోజనం.
1 నుంచి 9 తరగతులకు సెలవులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి
దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ
తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది.
షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ
మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం
తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 1 నుంచి 9 తరగతి
విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యాసంవత్సరం
పూర్తయినట్లు మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు
పాటించామన్నారు.
పది, ఇంటర్
పరీక్షలు యథాతథం
పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను ప్రస్తుతానికి యథాతథంగా నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పారు. అయితే తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు ప్రకటించారు. వారి విద్యా సంవత్సరం సోమవారంతో పూర్తయినట్లు చెప్పారు.
Great disition hats of adhi mulapu Suresh garu👏👏👏
ReplyDeleteOk thanks
ReplyDelete