100 Days Prescribed for Concluding the
Disciplinary Proceedings by All Government Departments
AP: అవినీతి కేసుల్లో
పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై 100 రోజుల్లో క్రమశిక్షణ
చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల
అవినీతి కేసుల్లో పట్టుబడిన
ప్రభుత్వ ఉద్యోగులపై వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పక్కా ఆధారాలతో
దొరికిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. 100రోజులు దాటితే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం
స్పష్టం చేసింది. అవినీతి నిరోధక శాఖ (అనిశా) డీజీ, శాఖల
ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
చేసింది.
PUBLIC SERVICES - Andhra Pradesh Civil
Services (Classification, Control and Appeal) Rules, 1991 - Departmental
Proceedings arising out of caught red handed cases undertaken by the Anti -
Corruption Bureau – New Timeline of 100 days prescribed for concluding the
disciplinary proceedings by all Government Departments - Orders – Issued.
G.O.MS.No. 41 Dated: 18-04-2021.
0 Komentar