Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: ఎంఐజీ లేఅవుట్ల ఎంపికకు కమిటీలు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

 

AP: ఎంఐజీ లేఅవుట్ల ఎంపికకు కమిటీలు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల  

3లక్షల నుంచి రూ. 18లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ప్లాట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగర ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టనున్న ఎంఐజీ గృహాల లేఅవుట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. మధ్య ఆదాయ వర్గాల ప్రజల కోసం నిర్మించే ఈ తరహా గృహాలకు భూలభ్యత, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ కమిటీలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. 

రాష్ట్రస్థాయిలో పురపాలక శాఖ కమిషనర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలు వివిధ పట్టణ ప్రాంతాలు, నగరాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో స్థలాల ఎంపిక, లబ్ధిదారుల గుర్తింపు, డిమాండ్ సర్వే ప్రక్రియను చేపడతాయని ప్రభుత్వం తెలిపింది. 150 గజాల నుంచి 240 గజాల వరకు మూడు కేటగిరీలుగా ఎంఐజీ ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే రూ. 3లక్షల నుంచి రూ. 18లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ ప్లాట్లను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Municipal Administration & Urban Development Department - Development of MIG Layouts/smart townships in Urban Local Bodies/Development Authorities - Constitution of Committees at District Level and State Level– Guidelines on identification of sites and for acquisition – Orders Issued.

G.O.Ms.No.38 Dated:09.04.2021

DOWNLOAD G.O

Previous
Next Post »

8 comments

  1. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకా..లేక అందరికా....? ఆధార్ లో అడ్రస్ village అయితే ఉద్యోగం కోసం పట్టణంలో నివాసం ఉంటున్న వారికి ఈ స్కీం వర్తిస్తుందా...?
    Pls.clarify sir ....tq

    ReplyDelete
  2. Guidelines ఇంకా రావలసిరా ఉంది కదా ! సార్

    ReplyDelete
  3. If adhar address belongs to Village eligible or not please clarify we are living in town

    ReplyDelete
  4. If adhar address belongs to Village eligible or not please clarify we are living in town

    ReplyDelete
  5. Please clarify if it is applicable for people who already got a own house?

    ReplyDelete
  6. Contact Near by Sachivalayam. As per latest news each family one application only.

    ReplyDelete
  7. Is it for government job holder or all job holder

    ReplyDelete
  8. All are eligible, govt job holders also.

    ReplyDelete

Google Tags