Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

April Fool's Day: Google Continues to Pause Pranks as The World Still Faces 'Serious Challenges'

 

April Fool's Day: Google Continues to Pause Pranks as The World Still Faces 'Serious Challenges'

ఏప్రిల్ ఫూల్స్ డే - వెనక్కి తగ్గిన గూగుల్  - కరోనా మహమ్మారే కారణం

ఏప్రిల్‌ ఫూల్స్‌ డేన నమ్మశక్యం కానీ, ఆశ్చర్యపోయే విషయాలు చెప్పి మన తోటివారిని ఆటపట్టిస్తుంటాం. సరదాగా జోకులేసుకుంటాం. గూగుల్‌తో సహా చాలా టెక్‌ సంస్థలు ఈ విషయంలో ముందుంటాయి. మార్స్‌పై సెటిల్‌మెంట్లు, హ్యూమన్ టు యానిమల్ ట్రాన్స్‌లేషన్ యాప్ తీసుకురావడం వంటి ప్రాంక్స్‌తో గూగుల్‌ ఈ రోజును వినియోగదారులతో సరదాగా జరుపుకొనేది. అయితే కరోనా మహమ్మారితో ప్రపంచమంతా బాధపడుతోన్న వేళ.. 2020లో ఇలాంటి ప్రాంక్స్‌కు గూగుల్‌ దూరం జరిగింది. 2021లో కూడా అదే నిర్ణయాన్ని కొనసాగించింది. దానికి బదులుగా కొవిడ్‌ను కట్టడి చేసే పోరాటంపైనే ప్రధానంగా దృష్టి సారించింది. 

ఏప్రిల్‌ మొదటి రోజున చాలా సంస్థలు జోకులతో వినియోగదారులను ఆట్టపట్టించే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. కొవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా అన్ని కంపెనీలు ప్రాంక్స్‌ విషయంలో వెనక్కి తగ్గాయి. గూగుల్ గ్లోబల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మార్విన్ చౌ దీనిపై సహోద్యోగులకు ఈ మెయిల్ చేశారు. ‘కొవిడ్‌తో పోరాటం చేస్తోన్నవారి గౌరవ సూచకంగా.. గూగుల్ సంప్రదాయంగా కొనసాగిస్తోన్న ఏప్రిల్ ఫూల్స్ డే వేడుకను గతేడాది మాదిరిగానే నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాం. మన వినియోగదారులకు ఆనందాన్ని పంచే తగిన మార్గాల అన్వేషణను కొనసాగిద్దాం’ అని దానిలో సిబ్బందికి సూచించారు. గూగుల్ నుంచి కూడా అధికారికంగా ఈ తరహా ప్రకటనే వెలువడింది. ఇదిలా ఉండగా, ఈ ఏప్రిల్ ఫూల్స్‌ డే సందర్భంగా.. బిట్‌కాయిన్‌ను అధికారిక చెల్లింపు విధానంగా ఆమోదించినట్లు ఈ కామర్స్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.

Previous
Next Post »
0 Komentar

Google Tags