Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Closure of Academic Year 2020-21 and Declaration of Summer Holidays for Class X from 01.05.2021 to 31.05.2021

 

Closure of Academic Year 2020-21 and Declaration of Summer Holidays for Class X from 01.05.2021 to 31.05.2021

సెలవుల్లో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాల ద్వారా సహకరించాల్సిందిగా ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసింది. 2021 పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా సందేహాలు నివృత్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ పాఠశాలల్లో తిరిగి రిపోర్టు చేయాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించింది. అంతేకాకుండా జూన్‌లో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ, విద్యార్ధుల సందేహాల నివృత్తి కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రాంతీయ డైరెక్టర్లను విద్యాశాఖ ఆదేశించింది. మే 1 నుంచి 31వ తేదీ వరకూ పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Rc.No.151/A&I/2020 Dated:29/04/2021

Sub: - School Education – COVID 19 Pandemic – Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Class X from 01.05.2021 to 31.05.2021 (last working day i.e., 30.04.2021) for all schools functioning under all managements for the Academic Year 2020-21 – Certain instructions issued – Regarding.

10వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు 1.5. 2021 నుండి 31.5.2021 వరకు వేసవి సెలవులు ప్రకటించడమైనది.

అన్ని యాజమాన్యాల పాఠశాలలకు పదవ తరగతి తరగతులు రద్దు చేయడమైనది.

ఏప్రిల్ 30 పాఠశాలకు చివరి పని దినం.

పదవ తరగతి పరీక్షల నిమిత్తం మే 1 నుండి 31 వ తేదీ వరకు అందరు విద్యార్థులు ఇంటి దగ్గర సన్నద్ధం కావాలి.

10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఉపయోగించి విద్యార్థులకు తగురీతిన సహకరించవలెను.

తిరిగి జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావడం కోసం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కోసం పాఠశాలకు తప్పనిసరిగా హాజరకావలెను. 

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags