Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

చిన్నారుల కోసం ఈటీవీ 'బాలభారత్' ప్రారంభం - దేశవ్యాప్తంగా 12 భాషల్లో, 12 ఛానళ్లు

 

చిన్నారుల కోసం ఈటీవీ 'బాలభారత్' ప్రారంభం  - దేశవ్యాప్తంగా 12 భాషల్లో, 12 ఛానళ్లు

పాతికేళ్లుగా వినోదరంగంలో తనదైన ముద్ర వేసిన ఈటీవీ నెట్ వర్క్ ఇప్పుడు చిన్నారుల కోసం 'బాలభారత్' అనే రంగుల హరివిల్లును తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 12 భాషల్లో, 12 ఛానళ్లను అందిస్తోంది. మంగళవారం RFC వేదికగా, ఈ 12 ఛానళ్లను ఒకేసారి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రారంభించారు. వార్త, వినోదాల ఛానళ్లతో ప్రతి ఒక్కరిని రంజింపజేస్తున్న ఈటీవీ చిన్నారులకు అందిస్తున్న కానుక ఇది!

స్థానిక భాషలో, గ్లోబల్ కంటెంట్ అందించాలన్న ఆలోచనతో, ఈటీవీ 12 భాషల్లో ఈ ఛానళ్లను తీసుకువచ్చింది. తెలుగుతో పాటు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, ఆంగ్ల భాషల్లో బాలభారత్ ప్రసారమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనసులను గెలుచుకున్న గ్లోబల్ షోలతో పాటు, దేశీయ వినోదాన్ని బాలభారత్ ఛానళ్లు అందించనున్నాయి. చిన్నారులను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన అంశాలను స్థానిక భాషల్లో అందిస్తూ, పిల్లల టెలివిజన్ ప్రపంచాన్నే సరికొత్తగా బాలభారత్ మార్చనుంది. కార్యక్రమాల విషయంలో ఆయా ప్రాంతాలు, భాష, అభిరుచులకు ప్రాధాన్యమిస్తూ, వీక్షకులకు -సరికొత్త అనుభూతిని అందించనుంది.

జిజ్ఞాసను, ఉత్తేజాన్ని కలిగించే అంశాలతో పిల్లల మనసును చూరగొనేలా బాలభారత్ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. కేవలం వినోదాన్ని అందివ్వడమే కాకుండా, చిన్నారుల్లో సంస్కారం, విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తుంది. అద్భుతమైన కథలు- పాత్రలు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యానిమేషన్, లైవ్ యాక్షన్లతో చిన్నారుల వినోద ప్రపంచం పూర్తిగా మారిపోనుంది. యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, థ్రిల్లర్, ఫాంటసీ వంటి వివిధ విభాగాలతో బాలభారత్, యువ మనసులను అలరించనుంది.

ETV Bal Bharat Launched in 12 Languages

Tata sky : 680 CHANNEL NUMBER

DISH TV : 990 CHANNEL NUMBER

BCN DIGITAL CABLE TV : 382 CHANNEL NUMBER

E TV BAL BHARAT - KIDS CHANNELS - DTH CHANNEL NUMBERS

ETV Bal Bharat Telugu OFFICIAL Logo

Previous
Next Post »
0 Komentar

Google Tags