Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Air Force Recruitment 2021: Apply for 1515 Group C-Civilian Vacancies

 

Indian Air Force Recruitment 2021: Apply for 1515 Group C-Civilian Vacancies

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో 1515 సివిలియన్ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శాశ్వత ప్రాతిపదికన వివిధ డివిజన్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రూప్, సీ సివిలియన్ పోస్టులు

* మొత్తం ఖాళీలు: 1515

పోస్టులు: సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, ఎల్‌డీసీ, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్, కుక్, ఆయా, టెయిలర్, టర్నర్, ఫైర్ మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సర్టిఫికెట్, హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.

వయసు సడలింపు: ఓబీసీ అభ్యర్థులకు 03 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసిన అనంతరం రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* రాతపరీక్షలో మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

1. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్

2. న్యూమరికల్ ఎబిలిటీ

3. జనరల్ ఇంగ్లిష్

4. జనరల్ అవేర్‌నెస్

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

* అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అందేలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. (మే 2, 2021)

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags