Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Home Loan: Interest rate increased - Check the Details

 

SBI Home Loan: Interest rate increased - Check the Details

గృహ రుణాలపై వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ 

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను సవరించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో తాజా రుణరేటు 6.95శాతంగా ఉంది. పెంచిన రేట్లు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఎస్‌బీఐ మార్చి 1న ఇంటి రుణాలపై వడ్డీరేట్లను అత్యంత కనిష్ఠంగా 6.70శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజుపైనా వంద శాతం రాయితీ కల్పించింది. అయితే ఆ పరిమిత ఆఫర్‌ మార్చి 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంకు గతంలోనే పేర్కొంది. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి నూతన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. తాజాగా ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీరేట్లు 6.95శాతంగా ఉన్నాయి. మరోవైపు గృహరుణాలపై 0.40శాతం ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్‌టీ కూడా ఉండనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. రుణాన్ని బట్టి ఈ ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 10వేల నుంచి రూ. 30వేల వరకు ఉండనుంది. ఇదిలా ఉండగా.. ఎస్‌బీఐ వడ్డీరేట్లను పెంచడంతో మిగతా బ్యాంకులు కూడా ఇదే నిర్ణయాన్ని అనుసరించే అవకాశాలున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags