Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telugu Writer Srirangam Srinivasarao (Sri Sri) Birth Anniversary

 

Telugu Writer Srirangam Srinivasarao (Sri Sri) Birth Anniversary

తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ భావాలతో నింపిన విప్లవ కవి ‘శ్రీశ్రీ’ జన్మ దినం

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది ని మరోసారి గుర్తు చేసుకుందాం.

ఇరవయ్యో శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి.... సంప్రదాయ ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి.... అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు... మరోవైపు సినీ రంగంపై తనదైన ముద్రవేసిన హేతువాది, నాస్తికుడు... తెలుగు సాహిత్యానికి దిక్సూచిలా వెలుగొందిన కవితా సంకలనం మహా ప్రస్థానం... ఆయన కవితా ప్రస్థానంలో ఓ మైలురాయి. ఆధునిక సాహిత్యాన్ని మహా ప్రస్థానానికి ముందు, తర్వాత రెండుగా విభజించి చెప్పడంలో అతిశయోక్తి కాదు... 'మరో ప్రపంచం, మరో ప్రపంచం మహాప్రపంచం పిలిచింది' అంటూ, 

మహాప్రస్థానం గమ్యం కాదు గమనం లక్ష్యంగా యుద్ధ మర్యాదలతో జీవితాన్ని అలంకరించింది. పేద ప్రజలకోసం ఏర్పడిన సిద్ధాంతాలు ఏవైనా అవి నావేనంటూ తన రక్తనిష్టలో రంగరించుకున్న మరొక మహాకవిని మరో వెయ్యేళ్లు అయినా చూడలేము. 

శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా తెలుగువారికి సుపరిచితమైన పేరు... ఈ పేరు వింటే తెలుగు సాహిత్యం పులకించిపోతుంది. 1930 వ దశకంలో తలెత్తిన ఆర్థిక మాంద్యం యావత్ ప్రపంచాన్ని చిన్నాభినం చేసింది. నిరుద్యోగ యువత మొదలుకొని చిరుద్యోగుల వరకూ సమాజంలోని అనేక వర్గాల ప్రజల జీవితాలు అల్లకల్లోలమైన సమయం. ఆ కాలాన్ని ఆకలి ముప్పైలు అంటే హంగ్రీ థర్టీస్‌గా పేర్కొన్నారు. ఈ దశలో వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ తన చుట్టూ జరిగిన సాంఘిక పరిణామాలు శ్రీశ్రీ రచనా వస్తువులను నిర్దేశించాయి. రచనా క్రమంలోనూ ఆదిలో పద్యాలను భావకవుల ప్రభావంతో రాసిన శ్రీశ్రీ, క్రమంగా ఇతర భాషల్లోని ప్రక్రియాపరమైన మార్పులు అర్థం చేసుకుంటూ పరిపక్వ దశకు చేరుకున్నారు. 

తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీగా ఎదిగి, మహాకవిగా గుర్తింపు పొందిన శ్రీరంగం శ్రీనివాసరావు 1928 ఏప్రిల్ 30 విశాఖపట్నంలో జన్మించారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఉత్సాహంతో పద్యాలు రాయడం మొదలుపెట్టిన శ్రీశ్రీ తన తండ్రి ఇచ్చిన సులక్షణ సారం పుస్తకాన్ని చదివి ఆ నైపుణ్యంతో పదహారేళ్లకు రచయితగా మారాడు. తిక్కన, వేమన, గురజాడ తన కవిత్రయం అని చెప్పుకున్న శ్రీశ్రీ, పౌరాణిక కోలాహలాన్నీ, కొత్త పద బంధాలనూ చిన్ననాటి నుంచే తన కవిత్వంలో రంగరించుకుంటూ వచ్చాడు. శ్రీశ్రీ రాసిన ప్రభవలో తొలి కవిత మహాభారత గాధే కావడం విచిత్రం కాదు. మడుగులో దాగిన దుర్యోధునుడిని బయటకు రమ్మని భీముడు పిలిచే పద్యధార పేరు 'సమరాహ్వానం'. ఈ పద్యం పేరుకు కౌరవ రాజును ఉద్దేశించిందే అయినా, సమాజంలోని ప్రతీభాశక్తులకు, తన జీవితం అంతటా నిలబడబోయే సమరాహ్వానమే ఇచ్చాడు శ్రీశ్రీ. నిలబడి యుద్ధం చేయమని సవాల్‌ చేశాడు, ఎక్కడా దాగలేవు అని స్పష్టం చేశాడు. 

'ధైర్యము త్యజించి ఘోర యుద్ధంబునందు/ ననుచిత పలాయన పథంబు ననుసరించి/ ఓ సుయోధన! యెందేగి ఉంటివిపుడు?/ రమ్ము, క్షత్రియోచిత సంగరంబొనర్చ' అని పిలుపు నిచ్చాడు. ఇదే పౌరాణిక పటిమ 'మహాప్రస్థానం'లోకి కూడా ప్రసరిస్తుంది. జ్వాలాతోరణం, , మహాప్రస్థానం, నవకవిత... ఇంకా పలు కవితలు ఇందుకు శక్తివంతమైన ఉదాహరణలు. 'ప్రభవ'లో ఇలా సంస్క తీ సంపన్నంగా పౌరాణిక ఇతివత్తాలు, కథన పద్ధతుల కవితలు రాశాడు. 'విజయ విహారం' అనే కవితలోనూ కదనరంగంలో తాను సారథిగా ఉన్నంది సాక్షాత్తు అర్జునుడికి అని తెలిసిన ఉత్తర కుమారుడు తనను ప్రస్తుతిస్తూ, పెరిగిన ఆత్మవిశ్వాసంతో చెప్పే రచన కూడా, శ్రీశ్రీ ఆశ్చర్యకరంగా తాను పోగొట్టుకున్న మొదటి కవితా ఫక్కీలోనే చేశాడు. 

అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర, నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణం, రాయులు రంచించిన అముక్తమాల్యద లాంటి ప్రబంధాలను పదహారేళ్లకే చదివేశాడు. ఆ కవుల పట్ల, భువన విజయం పట్ల గౌరవ ప్రపత్తులు ధ్వనించే కవితలను ప్రభవలో రాశాడు. సాగరాన్ని చూస్తూ శ్రీశ్రీ రాసిన గీతం ఒక రాత్రి, మహాప్రస్థానంలో ఎంతో ప్రసిద్ధి.

DOWNLOAD ‘MARO PRAPANCHAHM’ POEM

Inspirational Words of Mahakavi Telugu Poet Sri Sri

Akali Rajyam - Extraordinary Song - ( Sri Sri Birthday Special)

Previous
Next Post »
0 Komentar

Google Tags